Telugu Global
Cinema & Entertainment

నిర్మాత, సినీ జర్నలిస్ట్​ బీఏ రాజు కన్నుమూత ..!

ప్రముఖ సినీ జర్నలిస్ట్​, నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బీఏ రాజు జర్నలిస్ట్​గా తన కెరీర్​ను ప్రారంభించారు. ఎంతో మంది హీరోలకు ఆయన పీఆర్​వోగా కూడా పనిచేశారు. ప్రముఖ తెలుగు సినీ పత్రిక ‘సూపర్​హిట్’ కు ఆయన యజమాని. ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన భార్య జయ […]

నిర్మాత, సినీ జర్నలిస్ట్​ బీఏ రాజు కన్నుమూత ..!
X

ప్రముఖ సినీ జర్నలిస్ట్​, నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బీఏ రాజు జర్నలిస్ట్​గా తన కెరీర్​ను ప్రారంభించారు. ఎంతో మంది హీరోలకు ఆయన పీఆర్​వోగా కూడా పనిచేశారు.

ప్రముఖ తెలుగు సినీ పత్రిక ‘సూపర్​హిట్’ కు ఆయన యజమాని. ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన భార్య జయ దర్శకురాలు. బీఏ రాజు నిర్మించిన దాదాపు అన్ని సినిమాలకు ఆవిడే దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రిత‌మే ఆమె మృతిచెందారు. ​బీఏ రాజు ఎందరో అగ్రనటులతో సన్నిహిత సంబంధాలు కలిగిఉండేవారు. ఆయన మృతికి సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.

ప్రముఖ నటుడు మహేశ్​ బాబు.. బీఏ రాజుకు మృతికి సంతాపం తెలిపారు. ‘అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే బీఏ రాజు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు’ అని ఆయన పేర్కొన్నారు. ‘రాజుగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆయన మృతితో షాక్​ అయ్యా’ అంటూ మహేశ్​ బాబు ట్వీట్ చేశాడు.

‘బీఏ రాజుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన మరణవార్త విని తట్టుకోలేకపోయా’ అంటూ జూనియర్​ ఎన్టీఆర్​ ట్వీట్​ చేశాడు. వీరితోపాటు ఎందరో దర్శకనిర్మాతలు సైతం రాజు మృతికి సంతాపం తెలిపారు. దర్శకుడు మెహర్​ రమేశ్​, యువహీరో సాయిధరమ్​ తేజ్​ ఆయన మృతికి సంతాపం తెలిపారు.

First Published:  21 May 2021 11:54 PM GMT
Next Story