Telugu Global
Cinema & Entertainment

వీళ్లు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `అన్నాత్తె` సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంట‌ికి వెళ్లారు. అక్క‌డే రెండు రోజుల‌ పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. అక్క‌డి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో […]

వీళ్లు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే.
ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'అన్నాత్తె' సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ సినిమా
షూటింగ్ పూర్తికాగానే హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంట‌ికి వెళ్లారు.

అక్క‌డే రెండు రోజుల‌ పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. అక్క‌డి నుండి డైరెక్ట్‌గా
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో
ర‌జినీకాంత్‌, మోహ‌న్‌బాబు, విష్ణు మంచు క‌లిసి దిగిన ఫోటోల‌ను ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌..
అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు విష్ణు మంచు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో
వైర‌ల్ అవుతున్నాయి.

మోహన్ బాబు, రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి చేసిన
పెదరాయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది.

First Published:  21 May 2021 9:44 AM GMT
Next Story