Telugu Global
Health & Life Style

భయపెడుతున్న వైట్ ఫంగస్.. ఎలా సోకుతుందంటే..

ఒకపక్క కరోనా ఇబ్బందిపెడుతుంటే రీసెంట్ గా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చి భయపెడుతోంది. ఇప్పుడు అదీ చాలదన్నట్టు వైట్ ఫంగస్ అనే కొత్త వ్యాధి కలవరపెడుతోంది. బ్లాక్ ఫంగస్ తరహాలోనే వైట్ ఫంగస్ అనే కొత్త ఫంగస్ కూడా కోవిడ్ పేషెంట్లను భయపెడుతోంది. కాండిడా అల్బికాన్స్‌ అనే ఈ ఫంగస్ సోకడం వల్ల నోటిలోపలి భాగాలు, చర్మం, జననేంద్రియాల దగ్గరతెల్లటి మచ్చలు వస్తాయి. ఇలా సోకుతుంది బ్లాక్‌ ఫంగస్‌ లాగానే వైట్‌ ఫంగస్‌ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే […]

భయపెడుతున్న వైట్ ఫంగస్.. ఎలా సోకుతుందంటే..
X

ఒకపక్క కరోనా ఇబ్బందిపెడుతుంటే రీసెంట్ గా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చి భయపెడుతోంది. ఇప్పుడు అదీ చాలదన్నట్టు వైట్ ఫంగస్ అనే కొత్త వ్యాధి కలవరపెడుతోంది. బ్లాక్ ఫంగస్ తరహాలోనే వైట్ ఫంగస్ అనే కొత్త ఫంగస్ కూడా కోవిడ్ పేషెంట్లను భయపెడుతోంది. కాండిడా అల్బికాన్స్‌ అనే ఈ ఫంగస్ సోకడం వల్ల నోటిలోపలి భాగాలు, చర్మం, జననేంద్రియాల దగ్గరతెల్లటి మచ్చలు వస్తాయి.

ఇలా సోకుతుంది
బ్లాక్‌ ఫంగస్‌ లాగానే వైట్‌ ఫంగస్‌ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే ఉంటుంది. కరోనా టైంలో స్టెరాయిడ్లు అతిగా వాడడం లేదా షుగర్‌ లెవల్స్‌ తీవ్రంగా పెరిగిపోయినప్పుడు, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయినప్పుడు ఇది దాడి చేస్తుంది.

ప్రమాదం ఇదీ
వైట్‌ ఫంగస్‌ ముఖ్యంగా ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు, కిడ్నీలు, చర్మం, నోరు, జననేంద్రియాలకు సోకుతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువైతే చనిపోయే ప్రమాదమూ ఉంది. ఇది మహిళలు, చిన్న పిల్లల్లోనూ ప్రభావం చూపిస్తుంది.

లక్షణాలు ఇవీ..
నోటిలో, గొంతులో కురుపులు, తెల్లని మచ్చలు వస్తాయి. గొంతునొప్పి, వాపు ఉంటుంది. ఆయాసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. జననేంద్రియాలు, మూత్ర నాళాల దగ్గర ఇన్ఫెక్షన్లు రావొచ్చు. మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి.

ఇలా బయటపడాలి వైట్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ ను గుర్తిస్తే ట్రీట్ మెంట్ తో తగ్గించొచ్చు. అయితే అసలు రాకుండా ఉండాలంటే కోవిడ్ సమయంలో తగిన పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం మంచిది.

ఇదొక వాదన
కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్‌ అందించే సమయంలో.. ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానించే హ్యుమిడిఫయర్‌లో కలుషిత నీళ్లను వాడడం వల్ల కూడా వైట్‌ ఫంగస్‌ సోకే అవకాశముందని కొందరు అంటున్నారు.

First Published:  21 May 2021 3:59 AM GMT
Next Story