Telugu Global
NEWS

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యపై కేసు నమోదు..!

నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన కోవిడ్​ మందు ఇటీవల విశేష ప్రాచుర్యం పొందింది. ఆక్సిజన్​ లెవెల్స్ తగ్గిన వాళ్లు సైతం ఈ మందు వాడుతున్నారు. ఈ మందు వాడటంతో ఎంతో ఉపశమనం కలుగుతోందని సోషల్​ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. దీంతో ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచే కాక.. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా కోవిడ్​ బాధితులు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చేరుకుంటున్నారు.గత రెండ్రోజులుగా ఆనందయ్య తయారుచేసిన మందుకు విపరీతమైన ప్రచారం మొదలయ్యింది. దీంతో అతడి […]

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యపై కేసు నమోదు..!
X

నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన కోవిడ్​ మందు ఇటీవల విశేష ప్రాచుర్యం పొందింది. ఆక్సిజన్​ లెవెల్స్ తగ్గిన వాళ్లు సైతం ఈ మందు వాడుతున్నారు. ఈ మందు వాడటంతో ఎంతో ఉపశమనం కలుగుతోందని సోషల్​ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. దీంతో ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచే కాక.. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా కోవిడ్​ బాధితులు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చేరుకుంటున్నారు.గత రెండ్రోజులుగా ఆనందయ్య తయారుచేసిన మందుకు విపరీతమైన ప్రచారం మొదలయ్యింది. దీంతో అతడి ఇంటికి జనం పోటెత్తారు.

ఇవాళ వేల సంఖ్యలో జనం వచ్చారు. ఓ వైపు అంబులెన్సు ల్లో సైతం జనం వచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతుండటం.. వారు మాస్కులు, భౌతిక దూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

అయితే భారీగా వచ్చిన ప్రజలను కంట్రోల్​ చేయలేకపోయినందున పోలీసులు ఆనందయ్యపై కేసు నమోదు చేశారు. మరోవైపు నెల్లూరు ఎస్పీ ఆనందయ్యను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.
ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతున్నది. కరోనా పేరిట ప్రస్తుతం ఆస్పత్రుల్లో రూ. లక్షలు ఫీజు కింద వసూలు చేస్తున్నారు. ఆనందయ్య మాత్రం ఉచితంగా కోవిడ్​కు మందును అందజేస్తున్నారు.

అంతేకాక ఈ మందు ఎంతో మందిపై ప్రభావం చూపుతున్నది అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మందు తీసుకున్న వాళ్లే చెబుతున్నారు. దీంతో ఈ మందుకు ప్రాచుర్యం దక్కింది. సోషల్​ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం సాగింది. దీంతో జనం తండోపతండాలుగా కృష్ణపట్టణం తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ మందు పంపిణీని నిలిపివేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడమే అందుకు కారణమని సమాచారం.

ఆనందయ్య తయారు చేసిన ఔషధం గురించి సీఎం జగన్ కూడా తెలుసుకున్నారు. దీనిమీద శాస్త్రీయ అధ్యయనం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.

మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే.. ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు.

First Published:  21 May 2021 9:28 AM GMT
Next Story