Telugu Global
Cinema & Entertainment

ఇంత రచ్చ చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోరేం?

కవ్వించడంలో పీహెచ్డీ చేసింది తేజశ్వి. ఇప్పుడు కాదు, కమిట్ మెంట్ అనే సినిమా చేస్తున్న టైమ్ లోనే ఆమె కవ్వింతలు ఓ రేంజ్ లో చూశాం. ఆ ట్రెండ్ ను ఇప్పటికీ అలానే కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నప్పటికీ, ఈమెకు అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది తేజశ్వి. ఆ […]

ఇంత రచ్చ చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోరేం?
X

కవ్వించడంలో పీహెచ్డీ చేసింది తేజశ్వి. ఇప్పుడు కాదు, కమిట్ మెంట్ అనే సినిమా చేస్తున్న టైమ్ లోనే
ఆమె కవ్వింతలు ఓ రేంజ్ లో చూశాం. ఆ ట్రెండ్ ను ఇప్పటికీ అలానే కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. అయితే
బాధాకరమైన విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నప్పటికీ, ఈమెకు
అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి.

ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది తేజశ్వి. ఆ
తర్వాత ఆమెకు వరుసగా సినిమాలు పడ్డాయి. అల్లరమ్మాయిగా, కాలేజీ స్టూడెంట్ గా, ఎట్రాక్ట్ చేసే
పక్కింటమ్మాయిగా.. ఇలా చాలా పాత్రల్లో కనువిందుచేసింది. కాకపోతే అవన్నీ ఫెయిల్ అయ్యాయి.
సినిమాల సెలక్షన్ లో తేజశ్వి చేసిన తప్పులు ఆమె కెరీర్ ను కిందకు లాగేశాయి.

దీంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్స్ స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక దశలో ఓపెన్ టాప్ అందాలు కూడా ప్రదర్శించింది. అయినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. గడిచిన మూడేళ్లుగా చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన ఈ తెలుగుమ్మాయికి ఇప్పుడు ఆ అవకాశాలు కూడా పలకరించడం మానేశాయి.

ఒక టైమ్ లో క్రేజ్ కోసం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసింది తేజశ్వి. కాకపోతే అవి బ్యాక్ ఫైర్ అవ్వడంతో తూచ్, నేను పబ్లిసిటీ కోసమే అలా కామెంట్ చేశానంటూ తప్పించుకుంది. ఆ ప్రహసనం తర్వాత పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమైంది ఈ హీరోయిన్. హాట్ హాట్ ఫొటోలతో ఎట్రాక్ట్ చేస్తోంది.

తేజశ్వి గ్లామరస్ స్టిల్స్ వర్కవుట్ అయి, కనీసం ఈ కరోనా తగ్గిన తర్వాతైనా ఆమెకు అవకాశాలొస్తాయేమో
చూడాలి.

First Published:  20 May 2021 8:49 AM GMT
Next Story