Telugu Global
Cinema & Entertainment

ఆ దర్శకుడికి మరో రీమేక్ ఆఫర్

ఫ్లాప్ దర్శకులకు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం దొరికింది. అదే రీమేక్స్. నేరుగా ఓ కథ చెప్పి ఒప్పించలేని స్థితిలో ఉన్న దర్శకులు, ఇప్పుడు రీమేక్స్ తో హీరోల్ని సంప్రదిస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు వరుసగా రెండో రీమేక్ ఆఫర్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇది ఒక రీమేక్. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన సినిమాను తెలుగులో వెంకీ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమా […]

ఆ దర్శకుడికి మరో రీమేక్ ఆఫర్
X

ఫ్లాప్ దర్శకులకు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం దొరికింది. అదే రీమేక్స్. నేరుగా ఓ కథ చెప్పి
ఒప్పించలేని స్థితిలో ఉన్న దర్శకులు, ఇప్పుడు రీమేక్స్ తో హీరోల్ని సంప్రదిస్తున్నారు. ఇందులో భాగంగా
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు వరుసగా రెండో రీమేక్ ఆఫర్ అందుకున్నాడు.

ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇది ఒక రీమేక్. తమిళ్ లో
ధనుష్ హీరోగా నటించిన సినిమాను తెలుగులో వెంకీ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమా సెట్స్ పై
ఉంటుండగానే మరో రీమేక్ ఆఫర్ అందుకున్నాడు అడ్డాల.

ధనుష్ హీరోగా నటించిన మరో సినిమా కర్ణన్ తాజాగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్
వచ్చింది. రిలీజ్ కు ముందే ఈ సినిమాను చూసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్, దీని తెలుగు రీమేక్ లో
నటించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడీ తెలుగు రీమేక్ బాధ్యతల్ని శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించే
ఆలోచనలో ఉన్నారు.

First Published:  20 May 2021 8:57 AM GMT
Next Story