Telugu Global
Cinema & Entertainment

చిన్న సినిమాను పెద్దగా లేపే ప్రయత్నం

అదొక చిన్న సినిమా. కాకపోతే దానికి మెగా కాంపౌండ్ ఆశీస్సులు బలంగా ఉన్నాయి. జనాల్లో క్రేజ్ లేకపోయినా, కాంపౌండ్ అండదండలతో ఆ సినిమాను గట్టిగా లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. నిజానికి కొంతమంది హీరోలు కలిసి ఆ మూవీని గట్టిగా ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. ఈ మేరకు కోరడం, హామీలు తీసుకోవడం అన్నీ అయిపోయాయి. అంతలోనే సినిమాకు రీషూట్స్ పడ్డాయి. రీషూట్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న టైమ్ కు […]

చిన్న సినిమాను పెద్దగా లేపే ప్రయత్నం
X

అదొక చిన్న సినిమా. కాకపోతే దానికి మెగా కాంపౌండ్ ఆశీస్సులు బలంగా ఉన్నాయి. జనాల్లో క్రేజ్
లేకపోయినా, కాంపౌండ్ అండదండలతో ఆ సినిమాను గట్టిగా లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ
ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు.

నిజానికి కొంతమంది హీరోలు కలిసి ఆ మూవీని గట్టిగా ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. ఈ మేరకు కోరడం,
హామీలు తీసుకోవడం అన్నీ అయిపోయాయి. అంతలోనే సినిమాకు రీషూట్స్ పడ్డాయి. రీషూట్ చేసి రిలీజ్
చేద్దాం అనుకున్న టైమ్ కు కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది.

దీంతో ఇప్పుడు అన్ని ప్లాన్స్ పక్కనపడేసి, గంపగుత్తగా ఓటీటీకి ఇచ్చేద్దామనే ఆలోచన చేస్తున్నారు.
అయితే ఇక్కడ కూడా తమదే పైచేయిగా ఉండాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. చిన్న సినిమాల్లో పెద్ద
రేటుకు ఆ సినిమాను అమ్మించాలనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారీ రికమండేషన్లు
వాడుతున్నారు.

అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. ఎంత పలుకుబడి ఉపయోగించినా ఆ సినిమాను ఓటీటీలు
తీసుకోవడం లేదు. ఆల్రెడీ కొందరు సినిమా చూసి మొహంచాటేశారు. మరికొందరు మొహం మీదే
చెప్పేశారు. దీంతో కాంపౌండ్ పెద్దలు కూడా ఏం చేయలేకపోయారు.

నిజంగా సినిమాను లేపాలనుకుంటే ముందుగానే దానికి మంచి సెటప్ పెట్టుకొని ఉండాల్సింది. కొత్త
దర్శకుడు, పసలేని టీమ్ తో సినిమా తీసి ఇప్పుడు బ్లాక్ బస్టర్ కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే
ఉపయోగం ఉండదు కదా.

First Published:  20 May 2021 8:47 AM GMT
Next Story