Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ యాక్షన్ డ్రామా

షూటింగ్స్ ఆగిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న ఈ గ్యాప్ ను వరుణ్ తేజ్ బాగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అతడు తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పిన ఈ మెగా హీరో, ఇప్పుడు మరో దర్శకుడితో చేతులు కలిపాడు. అవును..యాక్షన్ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు వరుణ్ తేజ్. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. బీవీఎస్ఎన్ […]

వరుణ్ తేజ్ యాక్షన్ డ్రామా
X

షూటింగ్స్ ఆగిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్న ఈ గ్యాప్ ను వరుణ్ తేజ్ బాగా సద్వినియోగం
చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అతడు తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే వెంకీ
కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పిన ఈ మెగా హీరో, ఇప్పుడు మరో దర్శకుడితో చేతులు
కలిపాడు.

అవును..యాక్షన్ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు వరుణ్
తేజ్. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.

ప్రస్తుతం గని సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ మూవీ తర్వాత ఎఫ్3 కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత
వెంకీ కుడుముల సినిమా అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమా ఉంటుంది. అటు
ప్రవీణ్ కూడా ఈ గ్యాప్ లో నాగార్జునతో సినిమా పూర్తిచేస్తాడు.

First Published:  19 May 2021 7:22 AM GMT
Next Story