Telugu Global
Health & Life Style

మందులు మింగేస్తాయి జాగ్రత్త!

కోవిడ్ సోకి కొందరు, కోవిడ్ వస్తుందేమో అన్న భయంతో మరికొందరు ఇమ్యూనిటీ పేరుతో ఇంకొందరు ఇలా.. అందరూ మందులు మింగేస్తున్నారు. యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్ ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ అవసరానికి మించి వాడుతున్నారు. అయితే దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం కరోనాకన్నా కరోనా భయమే ఎక్కువగా ఉంటోంది. దాంతో ముందు జాగ్రత్త పేరుతో రకరకాల ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారు. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే వారితో పాటు మిగతా వారు […]

మందులు మింగేస్తాయి జాగ్రత్త!
X

కోవిడ్ సోకి కొందరు, కోవిడ్ వస్తుందేమో అన్న భయంతో మరికొందరు ఇమ్యూనిటీ పేరుతో ఇంకొందరు ఇలా.. అందరూ మందులు మింగేస్తున్నారు. యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్ ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ అవసరానికి మించి వాడుతున్నారు. అయితే దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందంటున్నారు డాక్టర్లు.

ప్రస్తుతం కరోనాకన్నా కరోనా భయమే ఎక్కువగా ఉంటోంది. దాంతో ముందు జాగ్రత్త పేరుతో రకరకాల ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారు. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే వారితో పాటు మిగతా వారు కూడా యాంటిబయాటిక్స్‌, విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కేవలం కరోనా భయంతో యాంటీ బయాటిక్స్‌ వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ప్రమాదకరం కూడా. ఇలా మందులు ఎక్కువగా వాడడం వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బ తింటుంది. యాంటీ బయాటిక్స్ వాడకం ఎక్కువైతే ఎప్పుడైనా ప్రాణాంతక పరిస్థితుల్లో డాక్టర్లు యాంటిబయాటిక్స్‌ ఇచ్చినా అవి పనిచేయకపోవచ్చు.

అలాగే కరోనా సోకిన వారు వాట్సాప్ మెసేజ్ ల్లో వస్తున్న మందుల లిస్ట్ చూసి లేదా యూట్యూబ్ , గూగుల్ లో చూసి రకరకాల ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇలాంటి స్టెరాయిడ్స్ డోసేజీ పెరిగితే శరీరంలో హార్మోన్ల పని తీరు దెబ్బ తింటుంది. కొత్త వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
ఇక వీటతో పాటు బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ లాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారికి కోవిడ్ సోకితే వాళ్లు డాక్టర్ ను సంప్రదించి మాత్రమే మెడిసిన్స్ వాడాలి.

అసలు ఇలా మందుల వెంట పడే బదులు కాస్త శ్రద్ధగా రోజూ మంచి ఆహారం తీసుకుంటూ సహజంగా రోగ నిరోధ శక్తిని పెంచుకోవడం అన్నింటికంటే ఉత్తమం. అందకే తాజా కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ లాంటివి తింటూ ఆరోగ్యంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. మందులకు శరీరాన్ని అలవాటు చేయకూడదు.

First Published:  19 May 2021 3:53 AM GMT
Next Story