Telugu Global
NEWS

ఖైదీ నెంబర్ 3468తో పెనవేసుకుపోయిన బాబు..

రఘురామకృష్ణంరాజు అరెస్ట్ తర్వాత చంద్రబాబు, విపక్షాలు స్పందించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అధికార పార్టీ ఎంపీ అరెస్ట్ అయితే.. చంద్రబాబు గింజుకోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. టీడీపీకి చెందిన కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర.. అరెస్టైనప్పుడు కూడా బాబు ఈ రేంజ్ లో బాధపడలేదని ఎద్దేవా చేశారు. “అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ. మరి విపక్షాలు, పచ్చ మీడియా వాళ్లు గింజుకుంటున్నారేంటి? వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా […]

ఖైదీ నెంబర్ 3468తో పెనవేసుకుపోయిన బాబు..
X

రఘురామకృష్ణంరాజు అరెస్ట్ తర్వాత చంద్రబాబు, విపక్షాలు స్పందించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అధికార పార్టీ ఎంపీ అరెస్ట్ అయితే.. చంద్రబాబు గింజుకోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. టీడీపీకి చెందిన కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర.. అరెస్టైనప్పుడు కూడా బాబు ఈ రేంజ్ లో బాధపడలేదని ఎద్దేవా చేశారు.

“అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ. మరి విపక్షాలు, పచ్చ మీడియా వాళ్లు గింజుకుంటున్నారేంటి? వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా ఉంది. అచ్చెం, ధూళిపాళ్ల, కొల్లు అరెస్టైనప్పుడు కూడా టీడీపీలో ఈ ఏడుపులు, పెడబొబ్బలు లేవే. అంతగా పెనవేసుకుపోయాడా ఈ ఖైదీ 3468? అద్దె మైకులిచ్చింది మీరేనా?” అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

“సీఎం జగన్ ని అప్రతిష్ట పాలు చేయడానికి ఎల్లో మీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు.” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

రఘురామకృష్ణంరాజుది స్వయంకృతాపరాధం..
విపక్షాల వలలో చిక్కుకుని రఘురామరాజుకృష్ణంరాజు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారని, పతనంవైపు దిగజారి పోయారని పరోక్షంగా విమర్శించారు. “దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు.” అంటూ పరోక్షంగా రఘురామకృష్ణంరాజుపై ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.

First Published:  17 May 2021 7:34 AM GMT
Next Story