Telugu Global
Cinema & Entertainment

స్పోర్ట్స్ డ్రామాతో మెగాహీరో

‘జెర్సీ’ సక్సెస్ తర్వాత మళ్ళీ తెలుగులో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఈ కోవలోనే మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. పృథ్వి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా రాబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కనుందని, వైష్ణవ్ ఇందులో హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా కోసం హాకీ ట్రైనింగ్ తీసుకునే పనిలో ఉన్నాడట […]

స్పోర్ట్స్ డ్రామాతో మెగాహీరో
X

‘జెర్సీ’ సక్సెస్ తర్వాత మళ్ళీ తెలుగులో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఈ
కోవలోనే మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. పృథ్వి అనే కొత్త
దర్శకుడితో ఈ సినిమా రాబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగార్జున నిర్మిస్తున్న
ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కనుందని, వైష్ణవ్ ఇందులో హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని టాక్.

ప్రస్తుతం ఈ సినిమా కోసం హాకీ ట్రైనింగ్ తీసుకునే పనిలో ఉన్నాడట వైష్ణవ్. 2-3 నెలల పాటు
ట్రైనింగ్ తీసుకొని సినిమా సెట్స్ లో అడుగుపెడతాడట. వైష్ణవ్ కి హైదరాబాద్ లో ఉన్న సీనియర్
హాకీ ప్లేయర్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఉండదని, జస్ట్ హాకీ అనేది సినిమాలో ఒక ఎలిమెంట్ మాత్రమే అంటున్నారు.

ఇటివలే హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘A1 ఎక్స్ ప్రెస్’ అనే సినిమా చేశాడు. అంతలోనే మరో హాకీ బేస్డ్ మూవీ వస్తోందన్నమాట.

First Published:  17 May 2021 7:49 AM GMT
Next Story