Telugu Global
Others

ఇంట్లో వైఫై స్పీడ్ పెరగాలంటే..

ఈ లాక్ డౌన్ టైంలో ఇంటి నుంచే అన్నీ పనులు చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కటే ప్ర‌పంచంతో మనకున్న కనెక్షన్.. అలాంటి ఇంటర్నెట్ స్లో అయితే మనకొచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లో వైఫై స్పీడ్ ను ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.. స్విచ్ ఆఫ్ చేసి.. ఇంటర్నెట్ స్పీడ్ అనేది మోడెమ్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఐసీపీ సిగ్నల్స్ ను బట్టి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా వైఫై స్లో […]

ఇంట్లో వైఫై స్పీడ్ పెరగాలంటే..
X

ఈ లాక్ డౌన్ టైంలో ఇంటి నుంచే అన్నీ పనులు చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కటే ప్ర‌పంచంతో మనకున్న కనెక్షన్.. అలాంటి ఇంటర్నెట్ స్లో అయితే మనకొచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లో వైఫై స్పీడ్ ను ఎలా పెంచుకోవచ్చో చూద్దాం..

స్విచ్ ఆఫ్ చేసి..
ఇంటర్నెట్ స్పీడ్ అనేది మోడెమ్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఐసీపీ సిగ్నల్స్ ను బట్టి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా వైఫై స్లో గా ఉంటే ఒకసారి మోడెమ్ స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. అలాగే ఒకసారి మోడెమ్ నుంచి కేబుల్ తీసి మళ్లీ పెట్టాలి. ఇలా చేస్తే వైఫై స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.

రూటర్ ప్లేస్ ముఖ్యం
రూటర్ ఉంచే ప్లేస్ ను బట్టి కూడా వైఫై స్పీడ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. గోడ పక్కన, ఫర్నీచర్ మధ్యలో, పెద్దగా ఉండే వస్తువుల మధ్యలో ఇలా సిగ్నల్స్ అందని ప్లేస్ లో రూటర్ ఉంచడం వల్ల వైఫై స్పీడ్ తగ్గిపోతుంది. అందుకే వైఫై స్లో గా ఉందంటే.. రూటర్ కి సరిగ్గా సిగ్నల్స్ అందట్లేదని అర్థం. అందుకే ఓ సారి రూటర్ ప్లేసి మార్చి చూడడం ద్వారా స్పీడ్ పెరుగుతుందేమో చెక్ చేయండి.

మోడెమ్ పనిచేస్తుందా?
అంతా బాగానే ఉండి వైఫై స్పీడ్ తగ్గుతూ పోతుంటే మోడెమ్ అవుట్ డేట్ అయిందేమో చూసుకోవాలి. పాత రూటర్ లేదా మోడెమ్స్ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. అందుకే స్పీడ్ బాగుండాలంటే మోడెమ్ లేటెస్ట్ వెర్షన్ లో ఉండాలి.

యాంటెనా సిగ్నల్స్ తో..
వైఫై రూటర్ యాంటినా తోనే మన మొబైల్ కు సిగ్నల్స్ వస్తాయి. యాంటెన్నా ప్లేస్ మెంట్ అలాగే దాన్ని అమర్చిన యాంగిల్ ఇవన్నీ సరిగ్గా ఉండాలి. యాంటెన్నా కాస్త అటు ఇటుగా ఉన్నా వైఫై స్పీడ్ మారిపోతుంది. అందుకే యాంటెన్నాను మారుస్తూ.. ఎక్కడ సిగ్నల్ సరిగ్గా వస్తుందో చెక్ చేసుకుని రూటర్ అలాగే యాంటెన్నాను సెట్ చేయాలి.

Next Story