Telugu Global
Health & Life Style

‘ప్లాస్మా థెరపీ’ వృథా ప్రయాస..!

ప్లాస్మా థెరపీతో కరోనా బాధితుల మరణాల రేటు తగ్గుతోందని చాలా కాలంగా వార్తలు వినిపించాయి. దీంతో ప్లాస్మా కావాలంటూ నిత్యం మనకు సోషల్​ మీడియాలో ఎన్నో పోస్టులు కనిపిస్తుంటాయి. దీన్ని కూడా కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు. తొలుత పలు ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరఫీని ప్రయోగాత్మకంగా చేశారు కూడా. అయితే ప్రస్తుతం ప్లాస్మా థెరపీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ థెరపీ విజయవంతంగా పనిచేయడం లేదని.. పైగా దీని వల్ల వైరస్​ మరింత బలపడుతుందని ఐసీఎంఆర్​ శాస్త్రవేత్తలే అభిప్రాయపడుతున్నారు. […]

‘ప్లాస్మా థెరపీ’ వృథా ప్రయాస..!
X

ప్లాస్మా థెరపీతో కరోనా బాధితుల మరణాల రేటు తగ్గుతోందని చాలా కాలంగా వార్తలు వినిపించాయి. దీంతో ప్లాస్మా కావాలంటూ నిత్యం మనకు సోషల్​ మీడియాలో ఎన్నో పోస్టులు కనిపిస్తుంటాయి. దీన్ని కూడా కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు. తొలుత పలు ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరఫీని ప్రయోగాత్మకంగా చేశారు కూడా. అయితే ప్రస్తుతం ప్లాస్మా థెరపీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ థెరపీ విజయవంతంగా పనిచేయడం లేదని.. పైగా దీని వల్ల వైరస్​ మరింత బలపడుతుందని ఐసీఎంఆర్​ శాస్త్రవేత్తలే అభిప్రాయపడుతున్నారు.

ప్లాస్మా థెరపీతో కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గుతుందని గతంలో కొంతమంది డాక్టర్లు చెప్పారు. దీంతో కొందరు సెలబ్రిటీలు సైతం ఫ్లాస్మా దానం చేయాలంటూ ప్రకటనలు ఇచ్చారు. ప్రముఖ నటుడు చిరంజీవి సైతం ప్లాస్మా దానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.

అయితే ప్రస్తుతం ఈ ప్లాస్మా థెరపీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్లాస్మా థెరపీతో ఏ ఉపయోగం లేదని.. పైగా వైరస్​ మరింత స్ట్రాంగ్​ అయ్యే అవకాశం కూడా ఉందని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల 39 ట్రయల్ సెంటర్లలో 464 కోవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీని చేశారు. అయితే వారిలో ఎటువంటి మార్పు రాలేదు.

దీంతో 18మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్లాస్మా థెరపీతో ఎటువంటి ఉపయోగం లేదని.. పైగా దానివల్ల మరింత నష్టమని వారు అభిప్రాయపడ్డారు.

బ్రిటన్​లో మొత్తం18 వేల మందిమీద ప్లాస్మా థెరపీని ప్రయోగించారు. అయితే వారిలో ఎటువంటి మార్పు రాలేదు. మరోవైపు అర్జెంటీనాలో ప్లాస్మా థెరపీపై ప్రయోగాలు సాగాయి. దీంతో చివరకు ప్లాస్మా థెరపీతో ఏ ఉపయోగం లేదని తేలింది. త్వరలోనే మనదేశంలో ప్లాస్మా థెరపీని నిషేధించే అవకాశం ఉందని సమాచారం.

First Published:  16 May 2021 1:28 AM GMT
Next Story