Telugu Global
NEWS

బ్లాక్ ఫంగస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం..

కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో బ్లాక్ ఫంగస్ అనే సమస్య తలెత్తుతోంది. తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే తెలంగాణలో కోవిడ్‌ నయం కాకముందే బాధితుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయని, వారిని ప్రత్యేక గదిలో ఉంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నట్టు తెలిపారు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. బ్లాక్ ఫంగస్ భారిన పడుతున్న వారిలో ఎక్కువగా కళ్లు, ముక్కు సమస్యలు ఉంటున్న క్ర‌మంలోనే ఈఎన్టీ ఆస్పత్రులను నోడల్ కేంద్రాలుగా తెలంగాణ […]

బ్లాక్ ఫంగస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం..
X

కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో బ్లాక్ ఫంగస్ అనే సమస్య తలెత్తుతోంది. తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే తెలంగాణలో కోవిడ్‌ నయం కాకముందే బాధితుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయని, వారిని ప్రత్యేక గదిలో ఉంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నట్టు తెలిపారు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. బ్లాక్ ఫంగస్ భారిన పడుతున్న వారిలో ఎక్కువగా కళ్లు, ముక్కు సమస్యలు ఉంటున్న క్ర‌మంలోనే ఈఎన్టీ ఆస్పత్రులను నోడల్ కేంద్రాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ బారిన పడి, కోవిడ్‌ తో బాధపడుతున్నవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ భారిన పడ్డ‌వారికి కంటి సమస్యలు ఉంటే.. సరోజిని దేవి ఆసుపత్రిలో సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు డాక్టర్ శ్రీనివాసరావు. ఈ మేరకు గాంధీ, సరోజిని దేవి, కోటిలోని ఈఎన్టీ ఆస్పత్రుల సూపరింటెండెంట్ లకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. కోటిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నట్టు భరోసా ఇచ్చారు. అటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా బ్లాక్ ఫంగస్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారాయన. కోవిడ్‌ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్ అదుపులో ఉండేలా చూడాలన్నారు. షుగర్ కంట్రోల్ చేసేందుకు అవసరమైతే స్టెరాయిడ్స్ వాడాలని సూచించారు.

జిల్లాల్లోనూ బ్లాక్ ఫంగస్ దాడి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువుకు కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ తో బాధపడుతుండగా.. ఖమ్మం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. మధిర నియోజకవర్గంలోని.. నేరడ గ్రామంలో ఓ కరోనా రోగికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించగా.. అతడిని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు స్థానికి ప్రభుత్వ వైద్యులు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి కేసులు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రత్యేక చికిత్స అందుబాటులోకి తెస్తోంది.

First Published:  15 May 2021 10:10 AM GMT
Next Story