Telugu Global
NEWS

వసూళ్ల కోసమే తెలంగాణలో టాస్క్ ఫోర్స్ " రేవంత్ ధ్వజం

తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్.. ప్రగతి భవన్ లో వసూళ్ల ఫోర్స్ గా మారిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. టాస్క్ ఫోర్స్ కమిటీలో వసూల్ టీం మాత్రమే ఉందని, వైద్యులు ఎవరూ లేరని విమర్శించారాయన. కార్పొరేట్ కంపెనీలను పిలిచి దండుకుంటున్నారని మండిపడ్డారు. మల్లాపూర్ లో గర్భిణి వైద్యం అందక చనిపోయిన ఉదంతాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలన్నారు. […]

వసూళ్ల కోసమే తెలంగాణలో టాస్క్ ఫోర్స్  రేవంత్ ధ్వజం
X

తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్.. ప్రగతి భవన్ లో వసూళ్ల ఫోర్స్ గా మారిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. టాస్క్ ఫోర్స్ కమిటీలో వసూల్ టీం మాత్రమే ఉందని, వైద్యులు ఎవరూ లేరని విమర్శించారాయన. కార్పొరేట్ కంపెనీలను పిలిచి దండుకుంటున్నారని మండిపడ్డారు. మల్లాపూర్ లో గర్భిణి వైద్యం అందక చనిపోయిన ఉదంతాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలన్నారు. ఏపీనుంచి వచ్చే అంబులెన్స్ లు ఆపడంపై పెట్టిన శ్రద్ధ, అడ్మిషన్ కోసం హైదరాబాద్ ఆస్పత్రుల చుట్టూ అంబులెన్స్ లో తిరుగుతున్న గర్భిణి ఘటనపై పెట్టి ఉంటే రెండు ప్రాణాలు నిలిచేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా టాస్క్ ఫోర్స్ కి కార్పొరేట్ కంపెనీలు భారీగా విరాళాలు అందిస్తున్నాయి. నగదు రూపంలోనే కాకుండా, ఫార్మా కంపెనీలు అత్యవసర మందులను ఉచితంగా అందిస్తున్నాయి. కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటంతో పరిశ్రమలన్నీ విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. అయితే ఈ విరాళాల ప్రక్రియపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పేరుతో కంపెనీలను బెదిరించి విరాళాలు సేకరిస్తున్నారని, కలెక్షన్ మొదలు పెట్టారని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించిన రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా బాధితులకు వెయ్యి మందికి ప్రతి రోజూ ఉచితంగా భోజనం అందిస్తున్నట్టు తెలిపారాయన. సోనియా గాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు రేవంత్ రెడ్డి. లాక్ డౌన్ కారణంగా రోగుల కుటుంబ సభ్యులకు, వైద్య సిబ్బందికి కూడా భోజనాలు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. యూత్ కాంగ్రెస్ నేతలు కరోనా బాధితులకు సాయం చేస్తుంటే అరెస్ట్ లు చేస్తూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు గాంధీ ఆస్పత్రి వద్ద ఉచిత భోజనం అందిస్తామని చెప్పారు.

First Published:  15 May 2021 8:06 AM GMT
Next Story