Telugu Global
Health & Life Style

వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదంటే..

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత రెండు మూడు రోజుల పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం కామన్.. అయితే ఇవి కొంతమందిన మరీ ఎక్కువగా వేధిస్తుంటాయి. జ్వరం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వేధించకుండా కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే.. వ్యాక్సిన్ కు ముందు వ్యాక్సిన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కేవలం శరీరంలో కొన్ని మార్పుల వల్ల సహజంగా వస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే.. […]

వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదంటే..
X

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత రెండు మూడు రోజుల పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం కామన్.. అయితే ఇవి కొంతమందిన మరీ ఎక్కువగా వేధిస్తుంటాయి. జ్వరం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వేధించకుండా కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే..

వ్యాక్సిన్ కు ముందు
వ్యాక్సిన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కేవలం శరీరంలో కొన్ని మార్పుల వల్ల సహజంగా వస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే.. వీటిని ఎదుర్కోవచ్చు. వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలంటే.. వ్యాక్సినేషన్ కు ముందు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.

ఇమ్యూన్ బూస్టర్స్: ప‌సుపు, వెల్లుల్లి, అల్లం లాంటి రెగ్యులర్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ను వ్యాక్సినేషన్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి తీసుకుంటూ ఉండాలి. వీటిని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. తీసుకునే ఆహారంలో లేదా వీటన్నింటినీ కలిపి కషాయంలా చేసుకుని అయినా తాగొచ్చు. వ్యాక్సినేషన్ కు ముందు అల్లం, వెల్లుల్లి, పసుపు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వ్యాక్సినేషన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను కొంత వరకూ తగ్గించుకోవచ్చు.

ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్: వ్యాక్సినేషన్ కు ముందు రోజూ ఆహారంలో కాయ‌గూర‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఆకుకూర‌లు, పండ్లు, కాయ‌గూర‌ల్లో పోష‌కాలు, ఖ‌నిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి. ఇవి వ్యాక్సిన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోడానికి సాయపడతాయి.

వ్యాక్సిన్ కు తర్వాత..
డార్క్ చాక్లెట్‌: వ్యాక్సినేష‌న్ త‌ర్వాత డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల కొంత మేలు ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే స‌ప్లిమెంట్లు త‌క్షణ‌మే శ‌క్తినిచ్చి శరీరానికి కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వ్యాక్సినేషన్ తర్వాత డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది.
ఆలివ్ ఆయిల్‌: వ్యాక్సినేషన్ తర్వాత ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కొంత మార్పు ఉంటుంది. డ‌యాబెటిస్‌, నాడీ సంబంధిత సమస్యలను త‌గ్గించేందుకు ఆలివ్ ఆయిల్ సాయపడుతుంది.

ఇవి వద్దు
వ్యాక్సిన్ కు ముందు, తర్వాత ధూమ‌పానం లేదా మ‌ద్యపానం చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ మరీ ఎక్కువగా వచ్చే ప్రమాదముంది. అందుకే వ్యాక్సిన్ కు ముందు, తర్వాత వాటికి దూరంగా ఉండాలి.

First Published:  14 May 2021 4:36 AM GMT
Next Story