Telugu Global
NEWS

తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్ మార్గదర్శకాలు..

లేటుగా అయినా, లేటెస్ట్ గా కఠిన నిబంధనలతో తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. నేటినుంచి 10రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఉదయం 6గంటలనుంచి 10గంటల వరకు రోజులో కేవలం 4గంటలు మాత్రమే లాక్ డౌన్ కి మినహాయింపు ఇచ్చారు. మిగతా 20గంటలు రోడ్లపైకి అనుమతి లేకుండా ఎవరూ వచ్చేందుకు వీలు లేదు. తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలివే.. – లాక్ డౌన్ కేవలం గ్రామాలు, పట్టణాలకు మాత్రమే. జాతీయ రహదారుల మీద […]

తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్ మార్గదర్శకాలు..
X

లేటుగా అయినా, లేటెస్ట్ గా కఠిన నిబంధనలతో తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. నేటినుంచి 10రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఉదయం 6గంటలనుంచి 10గంటల వరకు రోజులో కేవలం 4గంటలు మాత్రమే లాక్ డౌన్ కి మినహాయింపు ఇచ్చారు. మిగతా 20గంటలు రోడ్లపైకి అనుమతి లేకుండా ఎవరూ వచ్చేందుకు వీలు లేదు.

తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలివే..
– లాక్ డౌన్ కేవలం గ్రామాలు, పట్టణాలకు మాత్రమే. జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
– జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
– ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ, ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
– ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
– ఉదయం 6 గంటలకే వైన్ షాపులు తెరుస్తారు, లాక్ డౌన్ నిబంధనల మేరకు 10గంటలకల్లా మూసి వేస్తారు.
– ప్రభుత్వ కార్యాలయాలు కేవలం 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
– గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
– తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులకు ప్రవేశం లేదు, నిత్య కైంకర్యాలకు ఆటంకం లేదు.
– తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు.
– సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలకు పూర్తిగా మూత
– ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
– అన్ని ముందస్తు అనుమతులతో జరిపే వివాహాలకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి
– అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
– ఉపాధిహామీ పనులకు ఆటంకం లేదు.
– వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
– యధావిధిగానే ధాన్యం కొనుగోళ్లు
– వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
– గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు అడ్డంకులు లేవు.
– విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలకు మినహాయింపు

First Published:  11 May 2021 9:39 PM GMT
Next Story