Telugu Global
Cinema & Entertainment

కుర్ర హీరోకు నో చెప్పిన కృతి శెట్టి

దగ్గుబాటి కుటుంబం నుండి త్వరలోనే మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నాడు. దాదాపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఉప్పెన హీరోయిన్ కృతి షెట్టిని సంప్రదించారు. ‘ఉప్పెన’ సినిమాతో రిలీజ్ కి ముందే క్రేజ్ సంపాదించుకొని రిలీజ్ తర్వాత స్టార్ డమ్ అందుకుంది కృతి శెట్టి. ఈమె […]

కుర్ర హీరోకు నో చెప్పిన కృతి శెట్టి
X

దగ్గుబాటి కుటుంబం నుండి త్వరలోనే మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు
అభిరామ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నాడు. దాదాపు ప్రీ
ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా
ఉప్పెన హీరోయిన్ కృతి షెట్టిని సంప్రదించారు.

‘ఉప్పెన’ సినిమాతో రిలీజ్ కి ముందే క్రేజ్ సంపాదించుకొని రిలీజ్ తర్వాత స్టార్ డమ్ అందుకుంది కృతి
శెట్టి. ఈమె అయితే బాగుంటుందని దర్శకుడు తేజ ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం కృతి, నాని సరసన శ్యామ్
సింగ రాయ్ సినిమాతో పాటు సుదీర్ బాబు తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో
నటిస్తుంది.

చేస్తున్న ఈ రెండు సినిమాలే కాకుండా ఈమె లిస్టులో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా
టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిన కృతి, అభిరామ్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తుందా లేదా చూడాలి.
తాజా సమాచారం ప్రకారం.. తేజ-అభిరామ్ సినిమాలో నటించేందుకు కృతిశెట్టి నిరాకరించినట్టు
తెలుస్తోంది.

First Published:  12 May 2021 8:20 AM GMT
Next Story