Telugu Global
NEWS

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్​..!

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ విధించాలన్న డిమాండ్​ తెరమీదకు వచ్చింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలన్నీ లాక్​డౌన్​ విధించాయి. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి ఈ నెల 21 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉండనున్నది. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసరాల సరుకులు కొనుగోలు చేసుకొనేందుకు […]

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్​..!
X

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ విధించాలన్న డిమాండ్​ తెరమీదకు వచ్చింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలన్నీ లాక్​డౌన్​ విధించాయి. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి ఈ నెల 21 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉండనున్నది.

అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసరాల సరుకులు కొనుగోలు చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజలు ఆ టైంలో పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. మరోవైపు లాక్​డౌన్​ ప్రకటనలతో మందుబాబులు ఒక్కసారిగా అలర్ట్​ అయ్యారు. నిన్న వైన్స్​ ముందు బారులు తీరారు.

అయితే లాక్​డౌన్​ టైంలోనూ వైన్స్​ తెరిచే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మందుబాబులు వినిపించుకోలేదు. గత ఏడాది లాగే .. మద్యం బ్లాక్​లో కొనుగోలు చేయాల్సి వస్తుందని భావించి భారీగా కొనుగోళ్లు చేపట్టారు. మరోవైపు తెలంగాణలో లాక్​డౌన్​తో రకరకాల వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరువ్యాపారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మరోవైపు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రియల్​ ఎస్టేట్​ దందా పడిపోయే అవకాశం ఉంది. లాక్​డౌన్​తో వలస కూలీలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వలసకార్మికులు హైదరాబాద్​ను విడిచిపెట్టి సొంతగ్రామాలకు తరలివెళ్లారు. తాజాగా లాక్​డౌన్​ విధించడంతో మిగతా వాళ్లు కూడా పల్లె బాట పట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వలసకార్మికులు కనిపిస్తున్నారు.

ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్వస్థలాలకు చేరుకొనేందుకు వలసజీవులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. గత ఏడాది కేవలం నగరాలకే పరిమితమైన కరోనా ఈ సారి.. పల్లెటూర్లకు కూడా పాకిపోయింది. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ దొరక్క రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

First Published:  12 May 2021 2:12 AM GMT
Next Story