Telugu Global
NEWS

రేపటినుంచే తెలంగాణలో లాక్ డౌన్..

తెలంగాణ ప్రభుత్వం ఉరుములేని పిడుగులా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంది. రంజాన్ పర్వదినం పూర్తయిన తర్వాత ఈనెల 15నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని అనుకుంటున్న సమయంలో ‘రేపటినుంచి లాక్ డౌన్’ అంటూ షాకిచ్చారు సీఎం కేసీఆర్. ఈమేరకు తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 10రోజులపాటు నిరవధిక లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. ఏపీకంటే 2 గంటలు ఎక్కువే.. తెలంగాణలో లాక్ డౌన్ విధి విధానాలపై కూడా స్పష్టమైన ప్రకటన వెలువడింది. […]

రేపటినుంచే తెలంగాణలో లాక్ డౌన్..
X

తెలంగాణ ప్రభుత్వం ఉరుములేని పిడుగులా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంది. రంజాన్ పర్వదినం పూర్తయిన తర్వాత ఈనెల 15నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని అనుకుంటున్న సమయంలో ‘రేపటినుంచి లాక్ డౌన్’ అంటూ షాకిచ్చారు సీఎం కేసీఆర్. ఈమేరకు తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 10రోజులపాటు నిరవధిక లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు.

ఏపీకంటే 2 గంటలు ఎక్కువే..
తెలంగాణలో లాక్ డౌన్ విధి విధానాలపై కూడా స్పష్టమైన ప్రకటన వెలువడింది. మే 12 నుంచి మే 22 వరకు 10రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 6గంటలనుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఆ సమయంలో నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలు కోసం ప్రజలు రోడ్లపైకి రావొచ్చు. ఉదయం 10గంటల తర్వాత ఏ ఒక్కరైనా రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం 4 గంటలు మాత్రమే ప్రజలకు బయట తిరిగేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఏపీలో 18గంటల నిరవధిక కర్ఫ్యూ అమలవుతుండగా, తెలంగాణలో ఏకంగా 20 గంటల కర్ఫ్యూ అమలులోకి రాబోతోంది. కర్ఫ్యూ సమయం దాటిన తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు.

కోర్టు మొట్టికాయలతో కఠిన నిర్ణయాలు..
తెలంగాణ కేబినెట్ భేటీకి కాస్త ముందుగా హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్‌ లు ఆపారని హైకోర్టు ప్రశ్నించింది. రాత్రి కర్ఫ్యూ సరిగా అమలు చేయడంలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. రంజాన్‌ తర్వాతే కరోనా కట్టడిపై తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించిన న్యాయస్థానం.. మతపరమైన ప్రదేశాల్లో జనసమీకరణ ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. కరోనా పరీక్షలు పెంచాలని తాము ఆదేశిస్తే మరింత తగ్గిస్తున్నారని, కోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేయడం బాధాకరం అని చెప్పింది. అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

హైకోర్టు స్వరం పెంచడంతో కేబినెట్ భేటీలో అంచనాలు తారుమారయ్యాయని తెలుస్తోంది. రంజాన్ పండగ వరకు ప్రజలకు వెసులుబాటు కల్పించి, ఆ తర్వాత లాక్ డౌన్ విధించాలనుకున్న తెలంగాణ సర్కారు.. క్షణం ఆలస్యం చేయకుండా రేపటినుంచే లాక్ డౌన్ అని ప్రకటించడం విశేషం. మరోవైపు టీకా కొనుగోళ్లకోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలని కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.

First Published:  11 May 2021 4:19 AM GMT
Next Story