Telugu Global
National

కేరళ ఆక్సిజన్ ఎవరికీ ఇవ్వం..

భారత్ పై ట్రావెల్ బ్యాన్ పెట్టారని ఇతర దేశాలపై నిందలు వేస్తూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ఇతర దేశాలే కాదు.. మన దేశంలోని రాష్ట్రాలు సైతం మాకు మేమే, మీకు మీరేనంటున్నాయి. ఈ విపరీతాలకు ఎవరినీ నిందించలేం, పరిస్థితులను తప్ప. అవును.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలపై ఆందోళనలు పెరిగిపోతున్న వేళ, కేరళ తన చుట్టూ గిరిగీసుకుంది. కేరళలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ని ఏ రాష్ట్రానికీ ఇవ్వలేమని, ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈమేరకు […]

కేరళ ఆక్సిజన్ ఎవరికీ ఇవ్వం..
X

భారత్ పై ట్రావెల్ బ్యాన్ పెట్టారని ఇతర దేశాలపై నిందలు వేస్తూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ఇతర దేశాలే కాదు.. మన దేశంలోని రాష్ట్రాలు సైతం మాకు మేమే, మీకు మీరేనంటున్నాయి. ఈ విపరీతాలకు ఎవరినీ నిందించలేం, పరిస్థితులను తప్ప. అవును.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలపై ఆందోళనలు పెరిగిపోతున్న వేళ, కేరళ తన చుట్టూ గిరిగీసుకుంది. కేరళలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ని ఏ రాష్ట్రానికీ ఇవ్వలేమని, ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈమేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కేంద్రం నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 40మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేశామని, ప్రస్తుతం తమ వద్ద 89 మెట్రిక్ టన్నుల నిల్వ మాత్రమే ఉందని, ఇకపై ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

మాకే సరిపోదు.. మీకెలా ఇస్తాం..?
కేరళలో ప్రస్తుతం 4,02,640 క్రియాశీల కేసులు ఉన్నాయని చెబుతున్న సీఎం పినరయి విజయన్, మే 15 నాటికి వాటి సంఖ్య 6 లక్షలు దాటే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లెక్కన చూస్తే మే 15 నాటికి కేరళ రాష్ట్రానికి 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని అందుకే నిల్వల విషయంలో తాము రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టలేమని ప్రధానికి రాసిన లేఖలో విజయన్ పేర్కొన్నారు. కేరళలోని అన్ని ప్లాంట్లకు కలిపి 219 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. పాలక్కాడ్‌ లోని ఐనాక్స్‌ ప్లాంట్‌లో 150 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ ఆక్సిజన్‌ ను ఆస్పత్రులకు తరలించడం భౌగోళికంగా కూడా తమకు కష్టమవుతోందని, అందువల్ల కేరళలో ఉత్పత్త చేసిన ప్రాణవాయువు రాష్ట్రానికే కేటాయించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేరళకు మరిన్ని క్రయోజనిక్‌ ట్యాంకర్లు కేటాయించాలని కోరారు.

మరోవైపు ఎన్నికల కారణంగా కేరళలో కరోనా ఉధృతి భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 28.88గా ఉంది. ఇప్పటివరకు కేవలం 17.38 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కేరళ కఠిన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఎవరికీ ఇవ్వలేమని తేల్చి చెబుతోంది.

First Published:  10 May 2021 9:32 PM GMT
Next Story