Telugu Global
NEWS

మురికి గుంటలో వాసన చూసే మనస్తత్వం చంద్రబాబుది..

చంద్రబాబు తప్పుడు మాటలు, వాటికి వత్తాసు పలుకుతూ ఈనాడు, ఏబీఎన్, టీవీ5 చేస్తున్న దుష్ప్రచారం వల్లే ఏపీలో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొందని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారులు వాస్తవాలు చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం అబద్ధాలు ఆపడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనడంలేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాబు అండ్ కో చేస్తున్న విష ప్రచారం వల్లే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. రాష్ట్రాలకు […]

మురికి గుంటలో వాసన చూసే మనస్తత్వం చంద్రబాబుది..
X

చంద్రబాబు తప్పుడు మాటలు, వాటికి వత్తాసు పలుకుతూ ఈనాడు, ఏబీఎన్, టీవీ5 చేస్తున్న దుష్ప్రచారం వల్లే ఏపీలో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొందని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారులు వాస్తవాలు చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం అబద్ధాలు ఆపడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనడంలేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాబు అండ్ కో చేస్తున్న విష ప్రచారం వల్లే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు.

రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని, ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు పంపాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని వివరించారు సజ్జల. వ్యాక్సిన్ కేటాయింపులను కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ మానిటరింగ్ చేస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ డీ లైసెన్సింగ్ చేసే విషయంపై.. డబ్ల్యుటీవోలోనూ చర్చలు జరుగుతున్నాయని, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పేటెంట్‌ పై కేంద్రానికి కూడా హక్కు ఉందని తెలిపారు. భారత్ బయోటెక్ పేటెంట్‌ ను డీ లైసెన్సింగ్ చేసి ఉత్పత్తి పెంచేందుకు.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత వదిలేసి.. జూమ్‌ ప్రసంగాలతో ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రామోజీరావు బంధువులకు చెందిన భారత్ బయోటెక్ నుంచి చంద్రబాబు ఏపీకి వ్యాక్సిన్ వచ్చేలా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు సజ్జల. వ్యాక్సిన్ పై పెత్తనం ఎవరిదో స్పష్టంగా తెలుస్తున్నా కూడా.. అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారికి ఏ శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారాయన.

కొవిడ్‌ కట్టడి కోసం సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలపై క్లారిటీ ఉండాలని, జగన్ కు ఆ క్లారిటీ ఉందని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్, ఆక్సిజన్ కోసం అన్నివిధాల కృషి చేస్తున్నామని చెప్పారు సజ్జల.

తండ్రీ కొడుకులు వ్యాక్సిన్ వేయించుకున్నారా..?
చంద్రబాబు, లోకేష్ అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా..? ఎక్కడ వేయించుకున్నారు? ఏపీలోనా, హైదరాబాద్ లోనా..? బయట నుంచి తెప్పించుకున్నారా? తండ్రీ కొడుకుల్లో ఎవరు ముందు వేయించుకున్నారని ప్రశ్నలు సంధించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చివరకు 18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలేదంటూ.. ఏజ్ గ్రూపుల మధ్య కూడా చిచ్చు పెడుతున్న నీఛ మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు. ప్రపంచంలోనే మురికి గుంటల దగ్గర వాసన పీల్చే మనస్తత్వం చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు.

First Published:  10 May 2021 8:15 AM GMT
Next Story