Telugu Global
Family

ఆన్ లైన్ లో పిల్లలు ఏం చేస్తున్నారో?

మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ టైంలో అన్నీ పనులు ఆన్ లైన్ లోనే.. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువ సేపు ఆన్ లైన్ లో గడిపేది పిల్లలే.. పాఠాల నుంచి గేమ్స్‌ వరకు పిల్లలు గంటల తరబడి ఇంటర్నెట్‌ తొ గడిపేస్తున్నారు. అయితే పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు.. ఏయే సైట్లు చూస్తున్నారు.. అనేవిషయాలపై పేరెంట్స్ ఓ లుక్కేసి ఉంచాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు. దీని గురించి సైబర్‌ క్రైం పోర్టల్‌ ‘సైబర్‌ దోస్త్‌’ […]

ఆన్ లైన్ లో పిల్లలు ఏం చేస్తున్నారో?
X

మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ టైంలో అన్నీ పనులు ఆన్ లైన్ లోనే.. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువ సేపు ఆన్ లైన్ లో గడిపేది పిల్లలే.. పాఠాల నుంచి గేమ్స్‌ వరకు పిల్లలు గంటల తరబడి ఇంటర్నెట్‌ తొ గడిపేస్తున్నారు. అయితే పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు.. ఏయే సైట్లు చూస్తున్నారు.. అనేవిషయాలపై పేరెంట్స్ ఓ లుక్కేసి ఉంచాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు. దీని గురించి సైబర్‌ క్రైం పోర్టల్‌ ‘సైబర్‌ దోస్త్‌’ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..

– ఆన్‌లైన్‌లో పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట గమనిస్తూ ఉండాలి.
– ఆన్ లైన్ లో జరిగే మోసాల గురించి, ఆన్‌లైన్‌ సేఫ్టీ గురించి పిల్లలతో చర్చిస్తుండాలి.
– పిల్లలు ఆడే ఆన్‌లైన్‌లో గేమ్స్‌ బయటి వాళ్లతో కాకుండా మీతోనే ఆడమని చెప్పాలి. ఎడిక్షన్ కు గురిచేసే గేమ్స్ అయితే వాటికి బదులు వేరే గేమ్స్ ఆడమని చెప్పాలి.
– ల్యాప్‌ టాప్స్, డెస్క్ టాప్స్ లో పేరెంటల్‌ కంట్రోల్స్‌ ఆన్‌లో పెట్టాలి. సేఫ్‌సెర్చ్‌ ఆప్షన్‌ పెట్టుకోవాలి.
వ్యక్తిగత సమాచారం, అడ్రస్‌లు, ఫోటోలు ఆన్‌లైన్‌లో ఇతరులతో పంచుకోకూడదని, అలా చేస్తే జరిగే నష్టాన్నీ పిల్లలకు వివరంగా చెప్పాలి.
– అపరిచిత వ్యక్తుల నుంచి, కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు, మెసేజ్ లకు రెస్పాండ్ అవ్వొద్దని చెప్పాలి.
– ఇంటర్నెట్‌ వాడేప్పుడు వచ్చే లింక్‌లు, పాప్‌ అప్స్‌, మెయిల్స్, యాడ్స్‌ ఇతర తెలియని లింక్‌లపై క్లిక్‌ చేయకూడదని పిల్లలకు చెప్పాలి.
– లాక్ డౌన్ లాంటి సమయాల్లో ఆన్ లైన్ లో స్పెండ్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సైబర్ నేరగాళ్లకు, మోసగాళ్లకు ఇదే అనువైన కాలం. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పిల్లలను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలి.

First Published:  10 May 2021 3:53 AM GMT
Next Story