Telugu Global
National

నాయకుడు లేని పోరాటం.. ఇంకెన్నాళ్లు..?

కాంగ్రెస్ ను ద్వేషించే వారు కూడా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. కేంద్రంలో బీజేపీని ఢీకొనే బలమైన ప్రతిపక్షం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఆవేదన, ఆందోళనకి అంతం ఎప్పుడనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ తనకి తానే నాయకుడు లేని పోరాటం చేస్తోంది. నాయకత్వం లేని ఆ పార్టీని బీజేపీ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చులకనగా చూస్తున్నాయి. దీనికి తగ్గట్టే.. కాంగ్రెస్ కూడా అధ్యక్ష ఎన్నికపై వెనకడుగులు […]

నాయకుడు లేని పోరాటం.. ఇంకెన్నాళ్లు..?
X

కాంగ్రెస్ ను ద్వేషించే వారు కూడా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. కేంద్రంలో బీజేపీని ఢీకొనే బలమైన ప్రతిపక్షం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఆవేదన, ఆందోళనకి అంతం ఎప్పుడనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ తనకి తానే నాయకుడు లేని పోరాటం చేస్తోంది. నాయకత్వం లేని ఆ పార్టీని బీజేపీ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చులకనగా చూస్తున్నాయి. దీనికి తగ్గట్టే.. కాంగ్రెస్ కూడా అధ్యక్ష ఎన్నికపై వెనకడుగులు వేస్తూ పోతోంది. రాహుల్ గాంధీ ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటూ కిరీట ధారణకు ముందుకు రావడంలేదు. దీంతో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొవిడ్ ఉధృతి దృష్ట్యా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకూడదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయించింది. కొవిడ్ పై నెపం నెట్టినా.. రాహుల్ గాంధీ ఇంకా మంకుపట్టు వీడకపోవడం వల్లే ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టే విషయంలో తాత్సారం జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ తాజాగా సమావేశమైంది. ఈ భేటీలో అధ్యక్ష ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. వాస్తవానికి జూన్‌ 23న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కరోనా ఉధృతి దృష్ట్యా సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్నికలను వ్యతిరేకించారు. దీంతో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించింది. తదుపరి తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.

తాత్కాలిక అధ్యక్షులతోనే సరి..
2017లో నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత ఆయన అస్త్ర సన్యాసం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2020 ఆగస్ట్ లో, 2021 ఫిబ్రవరిలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. అవి వాయిదా పడటంతో తాత్కాలిక అధ్యక్ష పదవిలో సోనియా కొనసాగుతున్నారు. ఇప్పుడు జూన్ లో జరగాల్సిన పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి.

పార్టీ అధినాయకత్వంలో మార్పులు జరగాలని, అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని జి-23గా పిలవబడే కాంగ్రెస్‌ అసమ్మతి నేతల బృందం గత కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తోంది. ఈ అసమ్మతిని అణగదొక్కేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందే కానీ.. ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏంటనేది లెక్కలోకి తీసుకోలేకపోతోంది. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం మినహా ఇంకెవరి పెత్తనం సాగదనే విషయం అందరికీ తెలిసిందే. అధ్యక్ష పదవికోసం ఎన్నికలు పెట్టినా పెట్టకపోయినా రాహుల్ గాంధీనే భావి నేతగా భావిస్తున్న తరుణంలో ఆయన పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతున్న వేళ, కాంగ్రెస్ కి కొత్త జవసత్వాలు రావాలంటే కనీసం నాయకుడంటూ ఎవరో ఒకరు ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీతో కాంగ్రెస్ ప్రజల్లోకి రావాలి. ఈ రెండూ జరగనన్నిరోజులు.. బలహీన ప్రతిపక్షంగా బీజేపీకి విజయాలను అందించడంకోసమే కాంగ్రెస్ మిగిలుంది అనుకోవాల్సి ఉంటుంది.

First Published:  10 May 2021 8:55 AM GMT
Next Story