Telugu Global
Cinema & Entertainment

పూర్తి క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి

దర్శకుడు అనీల్ రావిపూడి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తన అప్ కమింగ్ సినిమాలపై స్పష్టత ఇచ్చాడు. అనీల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే వార్త చాన్నాళ్లుగా నలుగుతోంది. దీనిపై స్పందించిన రావిపూడి, బాలయ్య కోసం కథ సిద్ధంగా ఉందని ప్రకటించాడు. మంచి టైటిల్ కోసం ట్రై చేస్తున్నామని, టైటిల్ దొరికిన వెంటనే బాలయ్యకు వెళ్లి కథ వినిపిస్తానన్నాడు. అటు మహేష్ తో ఆగిపోయిందనుకున్న సినిమాపై కూడా స్పందించాడు. మహేష్ తో సినిమా ఆగిపోలేదని స్పష్టంచేశాడు. త్రివిక్రమ్ […]

Anil Ravipudi
X

దర్శకుడు అనీల్ రావిపూడి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తన అప్ కమింగ్ సినిమాలపై స్పష్టత ఇచ్చాడు. అనీల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే వార్త చాన్నాళ్లుగా నలుగుతోంది. దీనిపై
స్పందించిన రావిపూడి, బాలయ్య కోసం కథ సిద్ధంగా ఉందని ప్రకటించాడు. మంచి టైటిల్ కోసం ట్రై
చేస్తున్నామని, టైటిల్ దొరికిన వెంటనే బాలయ్యకు వెళ్లి కథ వినిపిస్తానన్నాడు.

అటు మహేష్ తో ఆగిపోయిందనుకున్న సినిమాపై కూడా స్పందించాడు. మహేష్ తో సినిమా ఆగిపోలేదని
స్పష్టంచేశాడు. త్రివిక్రమ్ ఎంటరవ్వడంతో తన ప్రాజెక్టు కాస్త లేట్ అవుతుందని చెప్పాడు. తను చెప్పిన
పాయింట్ మహేష్ కు బాగా నచ్చిందన్నాడు రావిపూడి.

ఇక మూడో ప్రాజెక్టుపై స్పందిస్తూ.. రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వెల్ కథ రాస్తున్నట్టు ప్రకటించాడు అనీల్
రావిపూడి. ఇలా తన అప్ కమింగ్ ప్రాజెక్టుల్ని ప్రకటించిన అనీల్ రావిపూడి.. ఎఫ్3 సినిమా తర్వాత, ఈ 3
సినిమాల్లో ఏది సెట్స్ పైకి వస్తుందో అప్పుడే చెప్పలేనంటున్నాడు.

First Published:  10 May 2021 2:40 PM IST
Next Story