Telugu Global
National

మోదీలో ఫోర్స్ లేదు.. ఇక టాస్క్ ఫోర్సే గతి..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు అడ్డుకట్ట వేసే విధంగా.. ఎప్పటికప్పుడు కేంద్రానికి చురుకు పుట్టిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సుప్రీంకోర్టు చేతల్లోకి దిగింది. తానే నేరుగా ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. 6 నెలల కాలపరిమితితో పనిచేసే ఈ జాతీయ టాస్క్ ఫోర్స్ లో 12మందిని సభ్యులుగా చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. సభ్య కన్వీనర్ మినహా మిగతా వారంతా వైద్యులే కావడం గమనార్హం. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, లేదా ఆయన ప్రతినిధిగా నియమితులయ్యే అదనపు […]

మోదీలో ఫోర్స్ లేదు.. ఇక టాస్క్ ఫోర్సే గతి..
X

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు అడ్డుకట్ట వేసే విధంగా.. ఎప్పటికప్పుడు కేంద్రానికి చురుకు పుట్టిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సుప్రీంకోర్టు చేతల్లోకి దిగింది. తానే నేరుగా ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. 6 నెలల కాలపరిమితితో పనిచేసే ఈ జాతీయ టాస్క్ ఫోర్స్ లో 12మందిని సభ్యులుగా చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. సభ్య కన్వీనర్ మినహా మిగతా వారంతా వైద్యులే కావడం గమనార్హం. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, లేదా ఆయన ప్రతినిధిగా నియమితులయ్యే అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ఈ టాస్క్ ఫోర్స్ కి కన్వీనర్ గా వ్యవహరిస్తారని తెలిపింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరినైనా టాస్క్ ఫోర్స్ లోకి తీసుకునే వెసులుబాటు కల్పించింది.

కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శాస్త్రీయ ప్రణాళికలను టాస్క్‌ఫోర్స్‌ నిపుణులు రూపొందిస్తారని, విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తారని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ.. ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సిన్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని సుప్రీం పేర్కొంది.

“అపార అనుభవం ఉన్నవారంతా ఒకేచోట కలిసి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి శాస్త్రీయ దృక్పథంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. తాత్కాలిక పరిష్కారాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ టాస్క్‌ఫోర్స్‌ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మహమ్మారి తీవ్రతను ఇప్పుడే గుర్తించాలి. అలా గుర్తిస్తేనే.. శాస్త్రీయంగా మ్యాపింగ్‌ చేయడానికి వీలవుతుంది. కొత్తగా ఎదురయ్యే అనుభవాలకు అనుగుణంగా దిద్దుబాట్లు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఆక్సిజన్‌, మందులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, లాజిస్టిక్స్‌ ఎంతమేర అవసరమవుతాయో ముందుగానే గుర్తించాలి. ఆయా పరిణామాలను ఎదుర్కోవడానికి దేశాన్ని సిద్ధం చేయాలి. ఈ టాస్క్‌ఫోర్స్‌ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం, వ్యూహాలు అందిస్తుంది. రాబోయే సవాళ్లను పూర్తి పారదర్శకంగా, నైపుణ్యంతో ఎదుర్కోవడానికి సహకరిస్తుంది” అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.టాస్క్‌ఫోర్స్‌ తన సిఫార్సులు సమర్పించేంత వరకు కేంద్రం, ప్రస్తుత పద్ధతిలో ఆక్సిజన్‌ కేటాయింపులు చేసుకోవచ్చని తెలిపింది. వెంటనే పని ప్రారంభించాలని టాస్క్ ఫోర్స్ ని ఆదేశించింది.

First Published:  8 May 2021 11:30 PM GMT
Next Story