Telugu Global
National

జైళ్లలో రద్దీ తగ్గించండి.. అవసరమైతేనే అరెస్ట్ లు చేయండి..

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఖైదీల సంఖ్య తగ్గేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. అర్హులైన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌ లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బెయిల్‌, పెరోల్‌ రద్దు చేసిన వారితో పాటు.. బెయిల్‌, పెరోల్‌ కు అర్హత ఉన్న వారిని […]

జైళ్లలో రద్దీ తగ్గించండి.. అవసరమైతేనే అరెస్ట్ లు చేయండి..
X

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఖైదీల సంఖ్య తగ్గేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. అర్హులైన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌ లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బెయిల్‌, పెరోల్‌ రద్దు చేసిన వారితో పాటు.. బెయిల్‌, పెరోల్‌ కు అర్హత ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. మరో 90 రోజుల పాటు వారికి బెయిల్‌, పెరోల్‌ ఇవ్వాలని.. పేర్కొంది. కరోనా భయంతో ఖైదీలు సొంత ఊళ్లకు వెళ్లడానికి ఇష్టపడకపోతే.. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని, జైళ్లలోనే అవసరమైన వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పింది.

ఏడాది క్రితమే హైపవర్ కమిటీ..
కరోనా నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గించుకోవాలని గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హైపవర్ కమిటీలు ఏర్పాటు చేశాయి. వాటి సిఫార్సుల మేరకు ఖైదీలను విడుదల చేశాయి. తాజాగా మరోసారి ఆ కమిటీల సిఫార్సులను పరిశీలించాలని, అర్హులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్ అమలులో ఉన్నందున.. విడుదలైన ఖైదీలను స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన రవాణా వసతి కూడా అధికారులే కల్పించాలని సూచించింది. ఎప్పటికప్పుడు జైలు సిబ్బందితోపాటు, ఖైదీలకు కరోనా పరీక్షలు చేయించాలని, అవసరమైన వారికి చికిత్స అందించాలని, జైళ్లలో పరిశుభ్రత పాటించాలని, ఖైదీల్లో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని సూచించింది.

అనవసర అరెస్ట్ లు వద్దు..
సాధ్యమైనంత మేర అరెస్ట్ లను తగ్గించాలంటూ సుప్రీం పేర్కొంది. ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో అవసరమైతేనే అరెస్టులు చేయాలని స్పష్టం చేసింది. పోలీసు అధికారులు నిందితులను అనవసరంగా అరెస్ట్‌ చేయకూడదని, మేజిస్ట్రేట్లు దాన్ని ఉదాసీనంగా అనుమతించకూడదని స్పష్టం చేసింది.

First Published:  8 May 2021 11:50 PM GMT
Next Story