Telugu Global
NEWS

వ్యాక్సిన్​ నిరభ్యంతరంగా తీసుకోండి..! ధైర్యం నూరి పోస్తున్న బామ్మ

కరోనా వ్యాక్సిన్​పై మొదటి నుంచి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మనదేశానికి చెందిన రెండు కంపెనీలు వ్యాక్సిన్లను తయారుచేసిన విషయం తెలిసిందే. భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ వ్యాక్సిన్లను రూపొందించాయి. కానీ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడానికి వైద్య సిబ్బంది సైతం ముందుకు రాలేదు. అందుకు కారణం వ్యాక్సిన్​ సేఫ్​ కాదేమోనని అప్పట్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు అప్పట్లో కరోనా కేసులు ఈ స్థాయిలో లేవు. చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్​ వేసుకున్నా.. వేసుకోకపోయినా పెద్దగా తేడా ఉండదని […]

వ్యాక్సిన్​ నిరభ్యంతరంగా తీసుకోండి..! ధైర్యం నూరి పోస్తున్న బామ్మ
X

కరోనా వ్యాక్సిన్​పై మొదటి నుంచి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మనదేశానికి చెందిన రెండు కంపెనీలు వ్యాక్సిన్లను తయారుచేసిన విషయం తెలిసిందే. భారత్​ బయోటెక్​, సీరం ఇన్​స్టిట్యూట్​ వ్యాక్సిన్లను రూపొందించాయి. కానీ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడానికి వైద్య సిబ్బంది సైతం ముందుకు రాలేదు.

అందుకు కారణం వ్యాక్సిన్​ సేఫ్​ కాదేమోనని అప్పట్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు అప్పట్లో కరోనా కేసులు ఈ స్థాయిలో లేవు. చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్​ వేసుకున్నా.. వేసుకోకపోయినా పెద్దగా తేడా ఉండదని జనం భావించారు.

అంతేకాక వ్యాక్సిన్​ భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వ్యాక్సిన్లను హడావుడిగా తీసుకొచ్చారని.. క్లినికల్​ ట్రయల్స్​ సరిగ్గా జరగలేదని దుష్ప్రచారం సాగింది. మరోవైపు వ్యాక్సిన్​ వికటిస్తోందని.. వ్యాక్సిన్​ తీసుకున్నవారు చనిపోతున్నారంటూ కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో సాధారణ జనం సైతం వ్యాక్సిన్​ తీసుకోవడానికి జంకారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఆక్సిజన్​ దొరక్క, బెడ్లు అందుబాటులో లేక.. రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రజల్లో భయం నెలకొన్నది. ఎలాగైనా వ్యాక్సిన్​ వేసుకొని తీరాలని వాళ్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని హెల్త్​ సెంటర్ల వద్ద వ్యాక్సిన్​ డోసుల కోసం ప్రజలు బారులు తీరారు.

అయితే తాజాగా ఓ బామ్మ వ్యాక్సిన్​ గురించి అవగాహన కల్పిస్తున్నారు. 97 ఏళ్ల బామ్మ ఇటీవల వ్యాక్సిన్​ తీసుకున్నదట. తాను వ్యాక్సిన్​ తీసుకున్నానని.. తనకు ఏ ఇబ్బంది కలగలేదని సదరు బామ్మ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వ్యాక్సిన్​ గురించి బామ్మకు ఉన్న అవగాహన తెలుసుకొని అంతా ఆశ్చర్యపోతున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేషన్ బామ్మ మాట్లాడుతున్న ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

‘వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. అందుకు కారణం వ్యాక్సిన్ పై వస్తున్న పుకార్లే. ఎవరూ భయపడొద్దు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమీ కాదు. నేను మార్చిలో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నా. అప్పటి నుంచి నేనెంతో ఆరోగ్యంగా వున్నా. నాలో ఎలాంటి మార్పులు రాలేదు. కొంచెం కూడా నొప్పి అనిపించలేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. తాను రెండో డోస్ వేసుకునేందుకు ఎదురుచూస్తున్నా.’ అని బామ్మ ఆ వీడియోలో చెప్పారు. 97 ఏళ్ల బామ్మ ముందుకొచ్చి వ్యాక్సిన్ పై భరోసా ఇస్తున్న తీరుపై అంతటా ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

First Published:  9 May 2021 1:15 AM GMT
Next Story