Telugu Global
National

పాజిటివ్ రిపోర్టు లేకపోయినా.. వైద్యం..! -కేంద్ర ప్రభుత్వ ఆదేశం

ఏ చిన్న అనారోగ్య సమస్య కనిపించినా అది కోవిడ్ ఏమో అనే భయం వణిస్తున్న కాలం ఇది. అయితే.. పరీక్ష చేసి పాజిటివ్ అని నిర్ధార‌ణ‌ అయ్యే వరకు చికిత్స లేకుండా ఉంటున్నారు చాలామంది. అలాంటి పరిస్థితిని నివారిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే రిపోర్టు లేకపోయినా లక్షణాలను బట్టి పేషెంట్ల‌ను చేర్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఏ కోవిడ్ […]

పాజిటివ్ రిపోర్టు లేకపోయినా.. వైద్యం..! -కేంద్ర ప్రభుత్వ ఆదేశం
X

ఏ చిన్న అనారోగ్య సమస్య కనిపించినా అది కోవిడ్ ఏమో అనే భయం వణిస్తున్న కాలం ఇది. అయితే.. పరీక్ష చేసి పాజిటివ్ అని నిర్ధార‌ణ‌ అయ్యే వరకు చికిత్స లేకుండా ఉంటున్నారు చాలామంది. అలాంటి పరిస్థితిని నివారిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే రిపోర్టు లేకపోయినా లక్షణాలను బట్టి పేషెంట్ల‌ను చేర్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఏ కోవిడ్ పేషెంటు.. చికిత్స అందనిస్థితిలో ఉండరాదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా పేషెంటు వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తయినా సరే హాస్పిట‌ల్‌ లో చేర్చుకుని ఆక్సిజన్, మందులు ఇచ్చి చికిత్స చేయాలని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

కోవిడ్ ఉన్నట్టుగా నిర్దారణ కాకుండా అనుమానం మాత్రమే ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లలోని సస్పెక్ట్ వార్డులలో ఉంచాలని తెలిపింది. కోవిడ్ లక్షణాలతో వచ్చేవారిని హాస్పిట‌ల్‌ ఉన్న ప్రాంతానికి సంబంధించిన గుర్తింపు కార్డుని చూపించాలని కూడా వేధించవద్దని, వారున్న స్థితి, వారి అవసరాన్ని బట్టి హాస్పిట‌ల్‌ లో చేర్చుకోవాలని ఆదేశించింది. అవసరం లేనివారికి బెడ్లు కేటాయించవద్దని కూడా ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అన్ని ప్రయివేటు, ప్రభుత్వ హాస్పిట‌ళ్ల‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసి మూడురోజుల్లోగా కొత్త నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కోరింది.

First Published:  8 May 2021 7:42 AM GMT
Next Story