Telugu Global
NEWS

మేఘా సంస్థ దాతృత్వం.. ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్..

కరోనా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆదుకునేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. కరోనా వైద్యంలో ప్రాణవాయువు కొరతను దృష్టిలో ఉంచుకుని, ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా సంస్థ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పూర్తి ఉచితంగా ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని ప్రకటించింది. డీఆర్డోఓ సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. హైద‌రాబాద్‌ లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి ఆక్సిజన్ కావాలంటూ మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు అభ్య‌ర్థ‌న‌లు […]

మేఘా సంస్థ దాతృత్వం.. ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్..
X

కరోనా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆదుకునేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. కరోనా వైద్యంలో ప్రాణవాయువు కొరతను దృష్టిలో ఉంచుకుని, ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా సంస్థ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పూర్తి ఉచితంగా ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని ప్రకటించింది. డీఆర్డోఓ సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

హైద‌రాబాద్‌ లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి ఆక్సిజన్ కావాలంటూ మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు అభ్య‌ర్థ‌న‌లు రావడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా ఆస్పత్రుల్లో పలు విభాగాలకు ఇన్ ఫ్రాస్టక్చర్, వైద్య పరికరాలు అందించిన మేఘా సంస్థ.. ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వడానికి కూడా ముందుకొచ్చింది.

నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా.మనోహర్, ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సరోజిని దేవి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్ల అవసరం ఉందని విజ్ఞప్తులు వచ్చాయి. అపోలో ఆస్పత్రికి ప్రతిరోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లు సరఫరా చేసేందుకు మేఘా సంస్థ అంగీకరించింది. మొత్తంగా ఆస్పత్రులకు రోజుకి 500 ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది.

భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకి 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ తీసుకొని లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చబోతోంది మేఘా సంస్థ. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. స్పెయిన్ లో ఉన్న ఎంఈఐఎల్ కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు దిగుమతి కూడా చేసుకోబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది ఎంఈఐఎల్.

ఇప్పటికిప్పుడు ఆస్పత్రి అవసరాలను తీర్చడంతోపాటు భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు పెద్ద మొత్తంలో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. డీఆర్డీఓ టెక్నాలజీ సహకారంతో 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్డీఓ కల్నల్ బి.ఎస్.రావత్, డాక్టర్ రాఘవేంద్ర రావు పర్యవేక్షిస్తారు. మొత్తంగా డీఆర్డీఓ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 35 ల‌క్ష‌ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయబోతోంది.

First Published:  8 May 2021 7:02 AM GMT
Next Story