Telugu Global
National

మోదీని ఏకిపారేసిన ల్యాన్సెట్..

దేశంలో క‌రోనా క‌ట్టడి విష‌యంలో మోదీ స‌ర్కార్ తీరును పలు అంతర్జాతీయ పత్రికలు తీవ్రంగా విమర్శించాయి. తాజాగా ప్రముఖ మెడిక‌ల్ జ‌ర్నల్ ల్యాన్సెట్‌ కూడా మోదీ తీరుని తీవ్రంగా ఏకి పారేసింది. మోదీ వైఫల్యం వల్ల ఈ ఆగ‌స్ట్ క‌ల్లా ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు 10 లక్షల‌కు చేరతాయ‌ని, హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేష‌న్ అంచ‌నా వేసింద‌ని చెప్పింది. ఇలాంటి తీవ్రమైన సంక్షోభ స‌మ‌యంలో సమస్యను పరిష్కరించకుండా ట్విట‌ర్‌లో త‌మ‌పై వ‌స్తున్న విమ‌ర్శల‌ గురించి పట్టించుకోవడం, వాటిపై […]

మోదీని ఏకిపారేసిన ల్యాన్సెట్..
X

దేశంలో క‌రోనా క‌ట్టడి విష‌యంలో మోదీ స‌ర్కార్ తీరును పలు అంతర్జాతీయ పత్రికలు తీవ్రంగా విమర్శించాయి. తాజాగా ప్రముఖ మెడిక‌ల్ జ‌ర్నల్ ల్యాన్సెట్‌ కూడా మోదీ తీరుని తీవ్రంగా ఏకి పారేసింది. మోదీ వైఫల్యం వల్ల ఈ ఆగ‌స్ట్ క‌ల్లా ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు 10 లక్షల‌కు చేరతాయ‌ని, హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేష‌న్ అంచ‌నా వేసింద‌ని చెప్పింది.

ఇలాంటి తీవ్రమైన సంక్షోభ స‌మ‌యంలో సమస్యను పరిష్కరించకుండా ట్విట‌ర్‌లో త‌మ‌పై వ‌స్తున్న విమ‌ర్శల‌ గురించి పట్టించుకోవడం, వాటిపై చ‌ర్చలు పెట్టడం క్షమించ‌రాని విషయమని ల్యాన్సెట్ ఎడిటోరియ‌ల్ అభిప్రాయ‌ప‌డింది.

క‌రోనా మొద‌టి వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న భార‌త్.. సెకండ్ వేవ్ లో ఎదుర్కోలేకపోయిందని, దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ల్యాన్సెట్ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ వ‌ర‌కూ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌నీసం ఒక్కసారి కూడా స‌మావేశం కాక‌పోవ‌డం ఏంటని ప్రశ్నించింది.

వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, ఆక్సిజన్ కొరతను తీర్చడం, లాక్‌డౌన్ అంశాన్ని ప‌రిశీలించ‌డం, ఎప్పటిక‌ప్పుడు క‌చ్చిత‌మైన కరోనా స‌మాచారాన్ని ప్రజ‌ల ముందు ఉంచడం, 15 రోజుల‌కోసారి ప్రభుత్వంలో ఏం జ‌రుగుతోందో వివ‌రించడం లాంటివి చేయాలని ల్యాన్సెట్ సూచించింది. ఒకపక్క ఇన్ఫెక్షన్లు పెరిగుతుంటే ప్రభుత్వం ర్యాలీలు, మేళాలకు అనుమ‌తి ఇచ్చింద‌ని, క‌రోనా సెకండ్ వేవ్ మొదలైన త‌ర్వాత కూడా ఆరోగ్య మంత్రి హ‌ర్షవ‌ర్ధన్ క‌రోనాపై జ‌యించిన‌ట్లు ప్రక‌ట‌న‌లు చేశార‌ని గుర్తు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం త‌న త‌ప్పిదాల‌ను అంగీక‌రించి, బాధ్యత గ‌ల నాయ‌క‌త్వంతో, పార‌దర్శక‌త‌తోనే కరోనాని ఎదుర్కోవాలని ల్యాన్సెట్ అభిప్రాయ‌ప‌డింది.

First Published:  8 May 2021 4:35 AM GMT
Next Story