Telugu Global
National

కరోనా మరణ మృదంగం.. ప్రపంచంలోనే భారీగా..

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజీకి చేరుకుంటోంది. భారీ సంఖ్యలో కేసులతో పాటు మరణాలు కూడా వరల్డ్ రికార్డును దాటేస్తున్నాయి. రోజుకి నాలుగు వేల మరణాలతో.. అమెరికా, బ్రెజిల్ త‌ర్వాత ఒక్క రోజులో అధిక కరోనా మ‌ర‌ణాలు సంభవించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. గడిచిన పది రోజుల్లో 36,110 మంది మృతి చెందారు. అంటే గంటకు 150 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా గ‌త 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేల‌కుపైగా మ‌ర‌ణాలు […]

కరోనా మరణ మృదంగం.. ప్రపంచంలోనే భారీగా..
X

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజీకి చేరుకుంటోంది. భారీ సంఖ్యలో కేసులతో పాటు మరణాలు కూడా వరల్డ్ రికార్డును దాటేస్తున్నాయి. రోజుకి నాలుగు వేల మరణాలతో.. అమెరికా, బ్రెజిల్ త‌ర్వాత ఒక్క రోజులో అధిక కరోనా మ‌ర‌ణాలు సంభవించిన మూడో దేశంగా భారత్ నిలిచింది.

గడిచిన పది రోజుల్లో 36,110 మంది మృతి చెందారు. అంటే గంటకు 150 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా గ‌త 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌గా.. తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో ప్రపంచంలోనే రోజులో అధిక మరణాల లిస్టులో భారత్ చేరింది.

దేశంలో గ‌త 82 రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈఏడాది ఫిబ్రవ‌రి 14న మొదలైన సెకండ్ వేవ్‌లో ఇప్పటివ‌ర‌కు కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 82 వేల మంది మ‌ర‌ణించారు. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 853 మంది చనిపోగా ఉత్తరప్రదేశ్‌ లో 350, ఢిల్లీలో300 మరణాలు ఉంటున్నాయి

First Published:  8 May 2021 3:35 AM GMT
Next Story