Telugu Global
Family

త్వరలో థర్డ్​వేవ్​.. ఎక్కువ ముప్పు పిల్లలకే..!

దేశంలో కరోనా ఏ రేంజ్​లో విరుచుకుపడుతుందో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం సెకండ్​ వేవ్​ ఉధృతి సాగుతోంది. చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్​ దొర‌క్క‌ రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆస్పత్రులు ఇదే అదనుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. అయితే దేశంలో త్వరలో థర్డ్​వేవ్​ కూడా రాబోతున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అసలు పిల్లలకు కరోనా […]

త్వరలో థర్డ్​వేవ్​.. ఎక్కువ ముప్పు పిల్లలకే..!
X

దేశంలో కరోనా ఏ రేంజ్​లో విరుచుకుపడుతుందో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం సెకండ్​ వేవ్​ ఉధృతి సాగుతోంది. చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్​ దొర‌క్క‌ రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆస్పత్రులు ఇదే అదనుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి.

అయితే దేశంలో త్వరలో థర్డ్​వేవ్​ కూడా రాబోతున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అసలు పిల్లలకు కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు. యువత పై కూడా చాలా తక్కువ స్థాయిలో ప్రభావం చూపింది.

అయితే సెకండ్ వేవ్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. యువత కూడా భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ దఫా చిన్నారులకు కూడా కోవిడ్ వ్యాప్తి చెందుతోంది. పిల్లలు కూడా కోవిడ్ కేర్ సెంటర్లలో కనిపిస్తున్నారు. పసికందులు సైతం కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు.

ఫస్ట్​వేవ్​, సెకండ్​వేవ్​ మహారాష్ట్రలో ఎక్కువ ప్రభావం చూపిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం థర్డ్ వేవ్ పై దృష్టి సారించింది. ఒకవేళ థర్డ్ వేవ్​ వచ్చినా తట్టుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. థర్డ్​వేవ్​ను తట్టుకొనేందుకు బృహ‌త్‌ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, ఇతర ప్రాంతాలలో పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది.

ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గత వారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. మహరాష్ట్రలో ప్రతిరోజు 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. భారీగా మరణాలు నమోదవుతున్నాయి. మొదటి వేవ్​, సెకండ్​ వేవ్​ ఆ రాష్ట్రంలో ఎక్కువ ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తున్నది.

First Published:  6 May 2021 2:34 AM GMT
Next Story