Telugu Global
National

వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచండి.. ఆక్సిజన్ పై నో కామెంట్..

భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని, ఆయన వెంటనే దిగిపోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని అధ్యక్షతన అత్యవసర సమీక్ష జరిగింది. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. రాష్ట్రాలు, జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహకారం, ఔషధాల లభ్యతపై ఆయన అధికారులతో చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో […]

వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచండి.. ఆక్సిజన్ పై నో కామెంట్..
X

భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని, ఆయన వెంటనే దిగిపోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని అధ్యక్షతన అత్యవసర సమీక్ష జరిగింది. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. రాష్ట్రాలు, జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహకారం, ఔషధాల లభ్యతపై ఆయన అధికారులతో చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి తీసుకోబోతున్న చర్యలపైనా ఆయన చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఆక్సిజన్ పై నో కామెంట్..
దేశవ్యాప్తంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారు. వ్యాక్సిన్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సాయం కోసం కేంద్రంవైపు చూస్తున్నాయి. అదే సమయంలో కరోనా వైద్యంలో ఉపయోగిస్తున్న రెమెడిసెవిర్ సహా ఇతర ఔషధాల లభ్యత పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ దశలో ఆక్సిజన్ నిల్వలు, లభ్యత, సరఫరాపై ప్రధాని చర్చ చేపట్టకపోవడంపై వివిధ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అత్యవసరమైన ఆక్సిజన్ గురించి మాట్లాడకుండా, వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలివ్వడం ఏంటని నిలదీస్తున్నారు నిపుణులు. వ్యాక్సినేషన్ కేటాయింపుల్లో కేంద్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా.. టీకా వృథా గురించి ప్రధాని ప్రస్తావించడం కేంద్రం తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికేనంటున్నారు.

ఇప్పటివరకూ రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసినట్లు అధికారులు ఈ సమీక్షలో ప్రధాని మోదీకి వివరించారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 31శాతం మందికి టీకా తొలి డోసు టీకా ఇచ్చారని అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ ఉన్నప్పటికీ పౌరులు టీకా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. టీకా ప్రక్రియలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని సూచించారు.

మొత్తమ్మీద.. ప్రధాని సమీక్ష వ్యవహారం ఏదో కంటితుడుపు చర్యగానే భావించాలనే విషయం స్పష్టమవుతోంది. వ్యాక్సిన్ కేటాయింపులు తక్కువగా ఉన్నా.. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని రాష్ట్రాలను ఆదేశించడం, ఆక్సిజన్ నిల్వలపై చేతులెత్తేసిన కేంద్రం.. కరోనా వైద్యంపై రాష్ట్రాలకు సలహాలివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  6 May 2021 9:51 AM GMT
Next Story