Telugu Global
NEWS

చంద్రబాబు, లోకేష్ ఆలోచనలు.. పిశాచాలకంటే క్రూరాతి క్రూరం..

ఆంధ్ర ప్రదేశ్ శవాల దిబ్బగా మారాలని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కోరుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న తీరుని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎన్నడూ కోరుకోలేదని, సీఎం జగన్ విఫలమయ్యారని ఏడవడానికి, ఏపీ శవాల దిబ్బగా కనిపించాలని వారు దేవుళ్లకు మొక్కుతుంటారని అన్నారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా వారిద్దరి ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు […]

చంద్రబాబు, లోకేష్ ఆలోచనలు.. పిశాచాలకంటే క్రూరాతి క్రూరం..
X

ఆంధ్ర ప్రదేశ్ శవాల దిబ్బగా మారాలని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కోరుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న తీరుని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎన్నడూ కోరుకోలేదని, సీఎం జగన్ విఫలమయ్యారని ఏడవడానికి, ఏపీ శవాల దిబ్బగా కనిపించాలని వారు దేవుళ్లకు మొక్కుతుంటారని అన్నారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా వారిద్దరి ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు విజయసాయిరెడ్డి.

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారాయన.

“పాపాలు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడేమో కానీ తమను నిలువునా దోచుకుని, మాఫియా పాలనతో పీడించిన బాబు లాంటి వారిని ప్రజలు అస్సలు మన్నించరు. వరుస పరాజయాలు అందుకే. నిజాయతీ విలువ తెలియని వ్యక్తులు పరాజయాల భారం కింద నలిగిపోక తప్పదు” అని ట్వీట్ చేశారు.

“ఏపీలో అప్రతిహతంగా సాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆశలు చూపించాలి కాని అమలు చేస్తే ఎలా అనే మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తి అయోమయంలో పడ్డాడు. జీవన ప్రమాణాలు పెరిగి జనం చైతన్యవంతులైతే ఇక తమకు పుట్టగతులుండవనే భయం పట్టుకుంది.”
“కరోనా నియంత్రణ, పరీక్షలు, వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది రాష్ట్రం. అయినా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన బాబు, అద్దె మైకులు, అను ‘కుల’ మీడియా రాద్దాంతం కొనసాగుతూనే ఉంది. కష్ట కాలంలో బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారు.”

“ఆశలన్నీ చెల్లా చెదురైన తర్వాత తండ్రీ కొడుకుల భాష మారడంలో వింతేమీ లేదు. పార్టీ లేదు బొక్కా లేదు అని స్వయంగా పార్టీ అధ్యక్షుడే అన్నాక వీళ్ల సంస్కారహీన వీరంగాలు ఇలాగే ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరు. రాసి పెట్టుకో బాబూ.” అంటూ వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి.

First Published:  5 May 2021 10:18 AM GMT
Next Story