Telugu Global
NEWS

తిరుపతిలో భారీ మెజార్టీతో గురుమూర్తి విజయం..

తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్తి గురుమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2,31,943 ఓట్ల ఆధిక్యంతో 2019 సార్వత్రిక ఎన్నికల మెజార్టీ గీతను ఆయన చెరిపేశారు. 2019లో బల్లి దుర్గాప్రసాదరావుకి 2,28,376 ఓట్ల మెజార్టీ రాగా.. గురుమూర్తి దాన్ని అధిగమించారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 56.5 శాతం. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఆమెకు […]

తిరుపతిలో భారీ మెజార్టీతో గురుమూర్తి విజయం..
X

తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్తి గురుమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2,31,943 ఓట్ల ఆధిక్యంతో 2019 సార్వత్రిక ఎన్నికల మెజార్టీ గీతను ఆయన చెరిపేశారు. 2019లో బల్లి దుర్గాప్రసాదరావుకి 2,28,376 ఓట్ల మెజార్టీ రాగా.. గురుమూర్తి దాన్ని అధిగమించారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 56.5 శాతం. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఆమెకు వచ్చిన ఓట్ల శాతం 32.1 . ఇక బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కేవలం 5.3 శాతం ఓట్లు మాత్రమే సాధించడం కొసమెరుపు. ఇక్కడ జనసేనతో జట్టు కట్టిన బీజేపీ కనీసం రెండో స్థానం అయినా దక్కుతుందని ఆశలు పెట్టుకుంది. అయితే బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కేవలం 50,739 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కి 8,477(0.9 శాతం), ఓట్లు రాగా సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరికి 5,027 (0.5 శాతం) ఓట్లు వచ్చాయి. 13,300(1.4 శాతం) మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు.

తిరుపతి పరిధిలో వైసీపీ విజయం ఊహించినదే అయినా.. మెజార్టీపై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకి గతంకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని అంచనా వేశాయి. అయితే తిరుపతిలో వైసీపీ మెజార్టీని తగ్గించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నించింది. ముక్కోణ పోటీలో వైసీపీ విజయం సాధించినా గతం కంటే మెజార్టీ తగ్గుతుందని టీడీపీ, బీజేపీ అంచనా వేశాయి. అయితే వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి రాజకీయాలకు కొత్త కావడంతో సీనియర్లు గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు ఒక ఇన్ చార్జి మంత్రి, మరో మంత్రి ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. గురుమూర్తిని విజయతీరానికి చేర్చారు.

First Published:  2 May 2021 5:39 AM GMT
Next Story