Telugu Global
Health & Life Style

ఇకపై.. హాస్పిట‌ళ్ల‌ రూపురేఖలు మారిపోతాయా?

ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్ కి చికిత్స పొందుతోంది. ఎక్కడ చూసినా బెడ్స్ లేవు.. ఆక్సిజన్ లేదు అనే మాటలు మార్మోగుతున్నాయి. హాస్పిట‌ళ్లు. వైద్యులు, మందులు, వ్యాక్సిన్లు.. ఏవీ, ఎవరూ.. కరోనాని ఆపే పరిస్థితి లేదు. ఎక్కువమందికి దీర్ఘకాలం పాటు చికిత్సని అందించాల్సి రావటంతో బెడ్స్ కొరత ప్రధానంగా తెరమీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో హాస్పిట‌ల్స్ లో ఉన్న ప్రదేశాన్నే ఎక్కువమందికి చికిత్సని అందించేలా మార్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అలాగే హాస్పిట‌ల్ లోని క్రిములు మరింతగా వ్యాధులను పెంచకుండా […]

ఇకపై.. హాస్పిట‌ళ్ల‌ రూపురేఖలు మారిపోతాయా?
X

ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్ కి చికిత్స పొందుతోంది. ఎక్కడ చూసినా బెడ్స్ లేవు.. ఆక్సిజన్ లేదు అనే మాటలు మార్మోగుతున్నాయి. హాస్పిట‌ళ్లు. వైద్యులు, మందులు, వ్యాక్సిన్లు.. ఏవీ, ఎవరూ.. కరోనాని ఆపే పరిస్థితి లేదు. ఎక్కువమందికి దీర్ఘకాలం పాటు చికిత్సని అందించాల్సి రావటంతో బెడ్స్ కొరత ప్రధానంగా తెరమీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో హాస్పిట‌ల్స్ లో ఉన్న ప్రదేశాన్నే ఎక్కువమందికి చికిత్సని అందించేలా మార్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అలాగే హాస్పిట‌ల్ లోని క్రిములు మరింతగా వ్యాధులను పెంచకుండా నివారించే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో రానున్న కాలంలో హాస్పిట‌ళ్ల‌ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. నెససిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్.. అనే నానుడిని నిజం చేస్తూ రాబోయే కాలానికి తగినట్టుగా హాస్పిట‌ల్స్ రూపురేఖలు మార్చేయాలని సంబంధిత నిపుణులు ఆలోచిస్తున్నారు.

ఒక్కసారిగా వేలసంఖ్యలో పేషంట్లకు చికిత్సని అందించాల్సి వస్తే.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో కళ్లకు కట్టినట్టుగా తెలుస్తున్న క్రమంలో ఇలాంటి కొత్త ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కసారిగా వేలమందికి హాస్పటల్లో బెడ్స్ సమకూర్చి చికిత్సని అందించాల్సివస్తే.. హాస్పిట‌ల్ నిర్మాణం, వసతులు ఎలా ఉండాలి.. అనే అంశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. అదే విధంగా హాస్పిట‌ళ్ల‌లో వైరస్ మరింతగా వ్యాపించడాన్ని నివారించే విధానాలు సైతం రూపుదిద్దుకుంటున్నాయి. ఉదాహరణకు 33 అడుగుల గ్రిడ్ గదుల్లో ఇద్దరు పేషంట్లకు వసతిని ఏర్పాటు చేసి.. ఆ గదిని ఎప్పుడుకావాలంటే అప్పుడు కారిడార్ లో ఉన్న యాంటీ రూమ్ అనే ప్రదేశానికి అనుసంధానం చేసేలా డిజైన్ చేస్తున్నారు. యాంటీ రూమ్ అంటే.. పేషంట్లు ఉండే గదులకు.. చికిత్స చేసే ప్రదేశాలకు మధ్య ఉండే చిన్నపాటి గదులు. యాంటీరూమ్ లో సూక్ష్మక్రిములు, దుమ్ముధూళి లాంటివాటిని తుడిచిపెట్టేసే ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి. పేషంట్లను మొదట ఈ గదుల్లోకి తీసుకుని వెళ్లినప్పుడు వారి శరీరం, దుస్తుల ద్వారా చికిత్స గదుల్లోకి వెళ్లే క్రిములను ఈ గదుల్లో ఉండే ఎయిర్ ఫిల్టర్లు తొలగిస్తాయి. హాస్పటల్ సిబ్బంది సైతం.. ఇక్కడ దుస్తులు మార్సుకుని తిరిగి చికిత్సా ప్రదేశాలకు నీట్ గా వెళ్లే అవకాశం కూడా ఈ యాంటీ రూములు ఇస్తాయి. అంటే పేషంట్ గదులకు, చికిత్సా ప్రదేశాలకు మధ్య ఇవి ఉంటాయి. హాస్పటల్లో పేషంట్ల బెడ్లు, వసతులు, ఎక్విప్ మెంట్.. అన్నింటినీ సులువుగా కదిలేలా.. ఫ్లెక్సిబుల్ గా మార్చి తక్కువ ప్రదేశంలో ఎక్కువమందికి చికిత్సని అందించే విధానాలు ఇకపై అమల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

First Published:  1 May 2021 9:05 PM GMT
Next Story