Telugu Global
NEWS

టెన్త్ లో ఆల్ పాస్.. కండిషన్స్ అప్లై..

కరోనా బ్యాచ్ ఆల్ పాస్ అంటూ అందరినీ ఒకే గాటన కట్టకుండా ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ లు ప్రకటించబోతున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దవడంతో ఫీజులు కట్టినవారంతా పాస్ అయినట్టే లెక్క. అయితే అందరికీ పాస్ మార్కులు వేసి సరిపెట్టకుండా.. గ్రేడ్ లు ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు అధికారులు. ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాలు ప్రకటించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతర్గత మూల్యాంకనం కింద 20 […]

టెన్త్ లో ఆల్ పాస్.. కండిషన్స్ అప్లై..
X

కరోనా బ్యాచ్ ఆల్ పాస్ అంటూ అందరినీ ఒకే గాటన కట్టకుండా ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ లు ప్రకటించబోతున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దవడంతో ఫీజులు కట్టినవారంతా పాస్ అయినట్టే లెక్క. అయితే అందరికీ పాస్ మార్కులు వేసి సరిపెట్టకుండా.. గ్రేడ్ లు ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు అధికారులు. ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాలు ప్రకటించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అంతర్గత మూల్యాంకనం కింద 20 మార్కులు వేసి, వాటి ఆధారంగా సీబీఎస్ఈ ఫలితాలను ప్రకటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రద్దయిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. ఫార్మేటివ్ అసెన్‌ మెంట్ మార్క్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ ప్రకటిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే డేటా సిద్ధం చేశారు. తెలంగాణలో 5,21,393 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరూ పాస్ అయినట్టే. అయితే ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా వీరందరికీ గ్రేడ్లు మారిపోతాయి.

ఏపీలో ఎలా..?
ప్రస్తుతానికి ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని, లేదా రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి ఈనెల 3న అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని సూచించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలపై ముందుకే వెళ్తామంటోంది. ఆల్ పాస్ అనడం సులభమైన పనే అయినా.. భవిష్యత్ లో మెరిట్ విద్యార్థులు విద్య, ఉద్యోగ అవకాశాల సమయంలో ఇబ్బంది పడతారని సీఎం జగన్ చెబుతున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు పరీక్షలకు వ్యతిరేకంగా వస్తే.. ఏపీలో కూడా ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు.

First Published:  2 May 2021 12:40 AM GMT
Next Story