Telugu Global
Cinema & Entertainment

పెద్ద మనసు చాటుకున్న సురేష్ బాబు

సెకెండ్ వేవ్ మరింత భయంకరంగా ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలంతా మరోసారి రియాక్ట్ అయ్యారు. షూటింగ్స్ ఆపేయడంతో పాటు ఛారిటీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. చిరంజీవి సీసీసీ కార్యకలాపాల్ని మళ్లీ పునరుద్ధరించగా.. హీరోహీరోయిన్లంతా తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్మా, ఇంజెక్షన్లు, బెడ్స్, ఆక్సిజన్ కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ క్రమంలో సురేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన సురేష్ బాబుకు వైజాగ్ లో […]

పెద్ద మనసు చాటుకున్న సురేష్ బాబు
X

సెకెండ్ వేవ్ మరింత భయంకరంగా ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలంతా మరోసారి రియాక్ట్ అయ్యారు.
షూటింగ్స్ ఆపేయడంతో పాటు ఛారిటీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. చిరంజీవి సీసీసీ కార్యకలాపాల్ని
మళ్లీ పునరుద్ధరించగా.. హీరోహీరోయిన్లంతా తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో అవగాహన
కల్పిస్తున్నారు. ప్లాస్మా, ఇంజెక్షన్లు, బెడ్స్, ఆక్సిజన్ కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు
అందిస్తున్నారు. ఈ క్రమంలో సురేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన సురేష్ బాబుకు వైజాగ్ లో స్టుడియోస్ ఉంది. తన తండ్రి పేరిట
కట్టించిన రామానాయుడు స్టుడియోస్ ను వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఐసొలేషన్ కోసం ఇచ్చేశాడు
ఈ నిర్మాత. విశాఖలో కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లు లేదా వైద్య సిబ్బంది ఎవరైనా రామానాయుడు
స్టుడియోస్ కు వచ్చి, అక్కడ ఉన్న గదుల్లో ఐసొలేషన్ సౌకర్యం పొందవచ్చు.

కుటుంబానికి దూరంగా ఉంటూ వైద్యసేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి తన వంతుగా చేస్తున్న ఈ
చిన్న సహాయాన్ని అంతా ఉపయోగించుకోవాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు వైద్యులకు
ఐసొలేషన్ సౌకర్యాలు కల్పించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు సురేష్ బాబు.

First Published:  28 April 2021 9:28 AM GMT
Next Story