Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కొత్త సినిమా అప్పుడేనా..!

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఎనౌన్స్ మెంట్ నుండే అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇంకా ఆలస్యం అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ లేదా జులై లో రెగ్యులర్ షూట్ జరుపుకోవాలి. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తన చేతిలో ఉన్న ‘సలార్’, ‘ఆది […]

ప్రభాస్ కొత్త సినిమా అప్పుడేనా..!
X

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఎనౌన్స్ మెంట్ నుండే అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇంకా ఆలస్యం అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ లేదా జులై లో రెగ్యులర్ షూట్ జరుపుకోవాలి. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తన చేతిలో ఉన్న ‘సలార్’, ‘ఆది పురుష్’ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు ఓ కొలిక్కి వచ్చాకే ప్రభాస్ -నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుంది.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. లాంచ్ అయిన అదే నెలలో లేదా డిసెంబర్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ ముఖ్య పాత్రలో నటిస్తుండడం విశేషం.

ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా దాదాపు ఏడాదిన్నర పైనే షూట్ జరుపుకోనుందని అంటున్నారు. అందుకే ఈ లోపు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట ప్రభాస్. సో ఈ సినిమా 2022 లో రావడం దాదాపు అసాధ్యం.

First Published:  28 April 2021 9:24 AM GMT
Next Story