Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో పలువురు హీరోలు కరోనా బారిన పడగా తాజాగా అల్లు అర్జున్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని అల్లు అర్జున్ సూచించాడు. తన ఆరోగ్య పరిస్థితి పై అభిమానులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని తాను ఆరోగ్యంగానే ఉన్నానని బన్నీ ట్వీట్ చేశాడు. కరోనా సెకండ్ […]

అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో పలువురు హీరోలు కరోనా బారిన పడగా తాజాగా అల్లు అర్జున్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని అల్లు అర్జున్ సూచించాడు. తన ఆరోగ్య పరిస్థితి పై అభిమానులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని తాను ఆరోగ్యంగానే ఉన్నానని బన్నీ ట్వీట్ చేశాడు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమాల షూటింగ్ నిలిపేశారు. కానీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ మాత్రం కొనసాగించారు.

ఇటీవలి వరకు కూడా ఆ చిత్ర షూటింగ్ కొనసాగింది. రెండు మూడు రోజుల కిందట కూడా అల్లు అర్జున్ షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. పుష్ప యూనిట్లో ఇప్పటికే పలువురు కరోనాతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బన్నీకి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది.

అయితే ఆయన స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు కరోనా రావడంతో పుష్ప షూటింగ్ లో పాల్గొన్న వారు సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.

మెగా ఫ్యామిలీ లోని హీరోలు వరుస బెట్టి కోవిడ్ బారిన పడుతున్నారు. నాగబాబు కుమార్తె నిహారిక వివాహ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్ కోవిడ్ బారినపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నాగబాబు, అల్లు అరవింద్, చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ లకు కరోనా సోకింది. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడి చికిత్స పొందారు. తాజాగా అల్లు అర్జున్ కు కూడా వైరస్ సోకింది.

First Published:  28 April 2021 1:10 AM GMT
Next Story