Telugu Global
National

సచ్చినోళ్ల గురించి చర్చ అనవసరం.. కోవిడ్​ మరణాలపై సీఎం వ్యాఖ్యలు

మన దేశంలో కోవిడ్​ ఎటువంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు ఎంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నేతలు యథేచ్ఛగా ర్యాలీలు, రోడ్​షోలు జరుపుకొంటున్నారు. చాలా మంది ప్రజలకు మాస్కులే ఉండటం లేదు. కరోనా వ్యాప్తికి ఇటువంటి రోడ్​షోలు పరోక్షంగా కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు నేతలు ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆ జాబితాలో చేరిపోయారు. […]

సచ్చినోళ్ల గురించి చర్చ అనవసరం.. కోవిడ్​ మరణాలపై సీఎం వ్యాఖ్యలు
X

మన దేశంలో కోవిడ్​ ఎటువంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు ఎంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నేతలు యథేచ్ఛగా ర్యాలీలు, రోడ్​షోలు జరుపుకొంటున్నారు. చాలా మంది ప్రజలకు మాస్కులే ఉండటం లేదు. కరోనా వ్యాప్తికి ఇటువంటి రోడ్​షోలు పరోక్షంగా కారణం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే కొందరు నేతలు ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆ జాబితాలో చేరిపోయారు. ‘ కరోనా తో రోజుకు ఇన్ని వేల మంది చనిపోతున్నారు అని చాలా మంది చర్చించుకుంటున్నారు. దాని వల్ల ఉపయోగం ఏమిటి? చనిపోయిన వాళ్లు ఎలాగూ పోయారు? కనీసం ప్రస్తుతం బతికి ఉన్నవాళ్లనైనా కాపాడుకుందాం’ అంటూ మనోహర్​ లాల్ వ్యాఖ్యానించారు అయితే సీఎం వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆయనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

బాధ్యత యుతమైన పదవిలో ఉన్న మనోహర్​లాల్​ ఖట్టర్​ .. ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని వాళ్లు విమర్శిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేతలు సైతం మండిపడ్డారు. ఆయనకు అసలు జాలీ, మానవత్వం లేకుండా పోయాయని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు సీఎం పదవికి అనర్హులంటూ మండిపడ్డారు.

మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సకాలంలో ఆక్సిజన్​ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శ్మశానాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు చాలా చోట్ల రాజకీయనేతలే కరోనాను పెంచిపోషిస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్​షోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

First Published:  28 April 2021 4:10 AM GMT
Next Story