Telugu Global
Sports

సంక్షోభంలో ఇంత ఖ‌ర్చు అవ‌స‌ర‌మా..? " ఆండ్రూ టై

కోవిడ్‌ విజృంభణతో నెలకొన్న కల్లోల పరిస్థితులు క్రికెటర్లలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఐపీఎల్‌ను వీడేలా చేస్తున్నాయి. అయితే దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై ఐపీఎల్‌ను వీడుతూ ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్‌ టీమ్‌ సభ్యుడు ఆండ్రూ టై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు భారత్‌ క్రికెటర్‌ అశ్విన్‌ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ ఆడలేనని ప్రకటించాడు. ఇంత డబ్బు వెచ్చించడం అవసరమా? భారత్‌లో కోవిడ్‌ బాధితులు ఆస్పత్రులు దొరక్క అల్లాడుతుంటే.. ఐపీఎల్‌ కోసం ఇంత డబ్బు వెచ్చించడం అవసరమా అని […]

సంక్షోభంలో ఇంత ఖ‌ర్చు అవ‌స‌ర‌మా..?  ఆండ్రూ టై
X

కోవిడ్‌ విజృంభణతో నెలకొన్న కల్లోల పరిస్థితులు క్రికెటర్లలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఐపీఎల్‌ను వీడేలా చేస్తున్నాయి. అయితే దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై ఐపీఎల్‌ను వీడుతూ ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్‌ టీమ్‌ సభ్యుడు ఆండ్రూ టై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు భారత్‌ క్రికెటర్‌ అశ్విన్‌ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ ఆడలేనని ప్రకటించాడు.

ఇంత డబ్బు వెచ్చించడం అవసరమా?
భారత్‌లో కోవిడ్‌ బాధితులు ఆస్పత్రులు దొరక్క అల్లాడుతుంటే.. ఐపీఎల్‌ కోసం ఇంత డబ్బు వెచ్చించడం అవసరమా అని ప్రశ్నించాడు. కరోనా విలయతాండవానికి ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వం ఐపీఎల్‌పై ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు.

లీగ్‌ నుంచి తప్పుకున్న అశ్విన్‌
భారత్‌ సీనియర్‌ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. తాజా పరిస్థితులతో కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. కరోనాతో పోరాడుతున్న తన కుటుంబంతో పాటు బంధుమిత్రులకు అండగా నిలవాలనుకుంటున్నట్లు, పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ వచ్చి ఆడేందుకు ప్రయత్నిస్తానని ట్విట్‌ చేశాడు. వ్యక్తిగత కారణాలు అంటూ ఆర్‌సీబీ జట్టు సభ్యులైన కేన్‌ రిచర్డ్సన్, ఆడమ్‌ జంపా ఇప్పటికే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పారు.

First Published:  28 April 2021 4:45 AM GMT
Next Story