Telugu Global
National

పీరియడ్స్​ టైంలో టీకా తీసుకోవచ్చు..!

మహిళలు పీరియడ్స్​ టైంలో కరోనా టీకా తీసుకోవద్దని ఇటీవల కాలంలో సోషల్​ మీడియాలో ఓ పోస్టు వైరల్​ అవతోంది. చాలా మంది ఈ పోస్టును ట్రోల్​ చేయడంతో విపరీతంగా వైరల్​ అవుతోంది. దీంతో నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకోకూడదని చాలా మంది భావిస్తున్నారు. నెలసరి టైంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఆ టైంలో వ్యాక్సిన్​ తీసుకుంటే పనిచేయదని ఓ పోస్టు చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైద్యులు స్పందించారు. […]

పీరియడ్స్​ టైంలో టీకా తీసుకోవచ్చు..!
X

మహిళలు పీరియడ్స్​ టైంలో కరోనా టీకా తీసుకోవద్దని ఇటీవల కాలంలో సోషల్​ మీడియాలో ఓ పోస్టు వైరల్​ అవతోంది. చాలా మంది ఈ పోస్టును ట్రోల్​ చేయడంతో విపరీతంగా వైరల్​ అవుతోంది. దీంతో నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకోకూడదని చాలా మంది భావిస్తున్నారు. నెలసరి టైంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఆ టైంలో వ్యాక్సిన్​ తీసుకుంటే పనిచేయదని ఓ పోస్టు చక్కర్లు కొట్టింది.

అయితే ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైద్యులు స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. నెలసరికి కరోనా వ్యాక్సిన్ కు ఏ విధమైన సంబంధం ఉండదని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. నెలసరి టైంలో కూడా వ్యాక్సిన్​ తీసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పోస్టు ఫేక్​ అని తేల్చి పారేసింది.

మరోవైపు వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత పత్యం పాటించాలని.. నాన్​ వెజ్​ తీసుకోవద్దని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు ప్రచారమేనని డబ్ల్యూహెచ్​వో తేల్చి చెప్పింది. వ్యాక్సిన్​ తీసుకున్నాక ఎటువంటి పత్యం అవసరం లేదని డబ్ల్యూహెచ్​వో పేర్కొన్నది.

మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంతో చాలా మంది కరోనా వ్యాక్సిన్​ తీసుకోవడం లేదు. మనదేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ప్రతిరోజు 3 లక్షల పై చిలుకు కేసులు నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే అనధికారికంగా అంతకంటే ఎక్కువ కేసులే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

First Published:  27 April 2021 3:29 AM GMT
Next Story