Telugu Global
National

ఇండియాకు మరో వ్యాక్సిన్..

కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ తోపాటు దేశానికి మరో వ్యాక్సిన్ రాబోతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్- వీ వ్యాక్సీన్ మే 1వ తేదీ శనివారం నాడు ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. ఇండియాను ఆదుకునేందుకు రష్యా పూర్తిగా సహకరిస్తుందని, రష్యా నుంచి అందే స్పుత్నిక్ వీ టీకాలు కరోనాపై పోరులోభారత్ కు తోడ్పడతాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్- వీ ని మార్కెటింగ్ చేస్తున్న ఆర్డీఐఎఫ్, […]

ఇండియాకు మరో వ్యాక్సిన్..
X

కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ తోపాటు దేశానికి మరో వ్యాక్సిన్ రాబోతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్- వీ వ్యాక్సీన్ మే 1వ తేదీ శనివారం నాడు ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు.

ఇండియాను ఆదుకునేందుకు రష్యా పూర్తిగా సహకరిస్తుందని, రష్యా నుంచి అందే స్పుత్నిక్ వీ టీకాలు కరోనాపై పోరులోభారత్ కు తోడ్పడతాయని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్- వీ ని మార్కెటింగ్ చేస్తున్న ఆర్డీఐఎఫ్, ఇండియాలోని ఐదు కంపెనీలతో ఇప్పటికే టీకా తయారీ దిశగా డీల్స్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ సహా పలు కంపెనీలు, ఏడాదికి 85 కోట్ల స్పుత్నిక్ వి డోస్ లను తయారు చేయనున్నాయి. ఇందులో భాగంగానే రాబోయే నెల రోజుల్లో 5 కోట్ల వరకూ స్పుత్నిక్- వీ డోస్ లు ఇండియాకు అందించాలని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే నిర్ణయించింది. ఇవి దశలవారీగా ఇండియాకు చేరనున్నాయి.

First Published:  27 April 2021 5:41 AM GMT
Next Story