Telugu Global
National

ఇంట్లో ఉన్నా మాస్క్‌ పెట్టాల్సిందే..

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు వైరస్‌ కట్టడికి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. దాన్ని వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో మాత్రం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. బయటకు వెళ్తే మాస్క్‌ పెట్టుకునే స్థాయి నుంచి ఏకంగా ఇంట్లోనే మాస్క్‌ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఇంట్లో ఉన్నవారు కూడా మాస్క్‌ ధరించాలి. ఇంట్లోనూ మాస్క్‌ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. […]

ఇంట్లో ఉన్నా మాస్క్‌ పెట్టాల్సిందే..
X

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు వైరస్‌ కట్టడికి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. దాన్ని వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో మాత్రం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. బయటకు వెళ్తే మాస్క్‌ పెట్టుకునే స్థాయి నుంచి ఏకంగా ఇంట్లోనే మాస్క్‌ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఇంట్లో ఉన్నవారు కూడా మాస్క్‌ ధరించాలి. ఇంట్లోనూ మాస్క్‌ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్, హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, హోంశాఖ అదనపు కార్యదర్శి పియూష్‌ గోయెల్, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా సోమవారం మీడియాతో మాట్లాడారు. కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రజల్లో తలెత్తుతున్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు వారు ప్రయత్నించారు.

గతేడాది మొదటి వేవ్‌తో పోలిస్తే ఈసారి కరోనా వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది కంటే 2.25 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో, కర్ణాటకలో 3.3 రెట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5 రెట్లు ఎక్కువగా కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దూరం పాటించకుంటే ఒక్కో బాధితుడి ద్వారా 30 రోజుల్లో 406 మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందని డాక్టర్‌ పాల్‌ తెలిపారు. భౌతిక దూరం 50 శాతం పాటించినట్లయితే, ఒక్కో వ్యక్తి ద్వారా 15 మందికి మాత్రమే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్టు రుజువైంది. భౌతిక దూరాన్ని 75 శాతం పాటించిన బాధితుడి ద్వారా 30 రోజుల్లో 2.5 మందికే కరోనా సోకుతుంది. వ్యాక్సినేషన్‌కు, మహిళల పీరియడ్స్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇంట్లోనూ మాస్క్‌ ఎందుకు..?
ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌ ధరించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటి వరకు మనం బయటకు వెళ్లే సమయంలో మాత్రమే మాస్క్‌ను ధరించేవాళ్లం. కానీ ఇప్పుడలా కాదు.. మనం పీల్చే గాలి ద్వారా కరోనా సోకుతుందని రుజువైనందున..ఇంట్లో ఉన్న సమయంలోనూ మాస్క్‌ ధరించాలని కేంద్రం కోరుతుంది. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్‌ ధరిస్తే వైరస్‌ వ్యాప్తి చెందదని, ఇంటికి అతిథులను ఆహ్వానించవద్దొని కేంద్రం చెబుతుంది.

First Published:  26 April 2021 11:04 PM GMT
Next Story