Telugu Global
International

పౌరుడైనా ప్రధాని అయినా ఒక్కటే.. మాస్కులేదని ఫైన్​..!

ప్రస్తుతం ప్రపంచం కరోనా అనే మహమ్మారి చేతిలో పడి విలవిలలాడుతున్నది. మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. భారత్​ మాత్రం చిగురుటాకులా వణికిపోతున్నది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు, లాక్​డౌన్​ అమలు చేయలేకపోతున్నాయి. దీంతో రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్​ అందక కొందరు తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు రోగులకు కనీసం ఆస్పత్రుల్లో బెడ్స్​ కూడా దొరకడం లేదు. శ్మశానాల్లోనూ శవాలతో జాగరణ చేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో […]

పౌరుడైనా ప్రధాని అయినా ఒక్కటే.. మాస్కులేదని ఫైన్​..!
X

ప్రస్తుతం ప్రపంచం కరోనా అనే మహమ్మారి చేతిలో పడి విలవిలలాడుతున్నది. మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. భారత్​ మాత్రం చిగురుటాకులా వణికిపోతున్నది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు, లాక్​డౌన్​ అమలు చేయలేకపోతున్నాయి. దీంతో రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్​ అందక కొందరు తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు రోగులకు కనీసం ఆస్పత్రుల్లో బెడ్స్​ కూడా దొరకడం లేదు. శ్మశానాల్లోనూ శవాలతో జాగరణ చేసే పరిస్థితి వచ్చింది.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. థాయిలాండ్​లో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ దేశంలో మాస్కు ధారణ తప్పనిసరి చేశారు. మాస్కు లేకుండా ప్రజలెవరైనా బయటకు వస్తే 20 వేల భట్​లు అంటే మన కరెన్సీలో రూ. 48 వేల ఫైన్​ వేస్తున్నారు.

ఇటీవల ఆ దేశ ప్రధాని ప్రయుత్‌ చాన్‌–ఓచా ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం కూడా కరోనా వ్యాక్సినేషన్​ కోసమే. అయితే ఈ మీటింగ్​లో చాలా మంది ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. వారంతా మాస్కు పెట్టుకున్నారు. కానీ ప్రధాని మాత్రం మాస్కు పెట్టుకోలేదు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు .. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శులు సోషల్​ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై నెటిజన్లు ట్రోల్​ చేశారు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది రూల్​ ప్రకారం ప్రధానికి ఫైన్​ విధించారు.

అయితే తొలి ఉల్లంఘన
కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ స్పందించారు. ప్రధాని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.

First Published:  27 April 2021 10:19 AM GMT
Next Story