Telugu Global
National

‘చెక్ యువ‌ర్ లంగ్ కండీష‌న్‌’లో నిజ‌మెంత‌..?

ఊపిరిని బిగ‌బట్ట‌డం ద్వారా మ‌న‌కు క‌రోనా ఉందో .. లేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన ఓ వీడియో సందేశం. అస‌లు ఈ విధానానికి శాస్త్రీయ‌త ఉందో లేదా అనే విష‌యాన్ని మ‌నం తెలుసుకోక‌పోతే మ‌న ప్రాణాల‌ను మ‌న‌మే రిస్క్‌లో ప‌డేసిన‌వాళ్ల‌మ‌వుతాం.. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి పీడ విర‌గ‌డ చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు, వైద్య‌నిపుణ‌లు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంటే.. సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా మంది అశాస్త్రీయ ప‌రిజ్ఞానంతో ఏవేవో క‌థ‌లు అల్లేసి జ‌నాల ప్రాణాల‌తో […]

‘చెక్ యువ‌ర్ లంగ్ కండీష‌న్‌’లో నిజ‌మెంత‌..?
X

ఊపిరిని బిగ‌బట్ట‌డం ద్వారా మ‌న‌కు క‌రోనా ఉందో .. లేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన ఓ వీడియో సందేశం. అస‌లు ఈ విధానానికి శాస్త్రీయ‌త ఉందో లేదా అనే విష‌యాన్ని మ‌నం తెలుసుకోక‌పోతే మ‌న ప్రాణాల‌ను మ‌న‌మే రిస్క్‌లో ప‌డేసిన‌వాళ్ల‌మ‌వుతాం..

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి పీడ విర‌గ‌డ చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు, వైద్య‌నిపుణ‌లు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంటే.. సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా మంది అశాస్త్రీయ ప‌రిజ్ఞానంతో ఏవేవో క‌థ‌లు అల్లేసి జ‌నాల ప్రాణాల‌తో ఆడుకుంటున్నారు. ఇలా చేస్తే కరోనా రాదని, అలా చేస్తే కరోనా చచ్చిపోతుందంటూ కొత్త కొత్త మెసేజ్‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వార్త‌లు క‌రోనా కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఇప్పుడు కరోనా లక్షణాలు బయటపడటం లేదు. వైరస్ శరీరంలోకి ప్రవేశించినా తెలియ‌డం లేదు. చివరికి కోవిడ్ టెస్ట్‌ల‌కు కూడా ఈ మాయ‌దారి వైర‌స్‌ చిక్కడం లేదు.

తాజాగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ‘చెక్ యువ‌ర్ లంగ్ కండీష‌న్‌’ అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరు ఇంట్లో కూర్చొనే కోవిడ్-19 ఉందో లేదో తెలుసుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సింద‌ల్లా జస్ట్ ఊపిరి బిగబట్ట‌డ‌మే. 21 సెకన్ల ఈ వీడియోలో మొత్తం మూడు స్టేజ్‌లు ఉంటాయి. మొదటి స్టేజ్‌.. బ్రీత్ ఇన్‌.. అంటూ ఊపిరి పీల్చ‌డం, రెండో స్టేజ్‌.. A నుంచి B వరకు ఊపిరి బిగపట్టి ఉండ‌టం, తర్వాత శ్వాసను వదిలేయ‌డం. అలా A నుంచి B వరకు ఊపిరి బిగబట్టి ఉండగలిగితే మీకు కరోనా లేనట్లేనని ఆ వీడియో సందేశం.

నిజమెంతా?
సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ 'టెస్ట్‌'పై అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఫహీమ్ యునస్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనికి శాస్త్రీయ‌త లేద‌ని, ఎవ‌రూ దీన్ని విశ్వ‌సించ‌వ‌ద్ద‌ని కోరారు. ఇప్ప‌టికైనా ఇలాంటి అశాస్త్రీయ విధానంతో కూడిన మెసేజ్‌లు, వీడియోల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. ఇలాంటి వాటిని మిత్రుల‌కు, బంధువుల‌కు, శ్రేయోభిలాషుల‌కు షేర్ చేసే ముందు ఒక‌సారి మ‌న‌స్సుతో ఆలోచిస్తే మ‌నం వారి ప్రాణాల‌ను కాపాడిన‌వార‌మ‌వుతాం.

First Published:  27 April 2021 6:37 AM GMT
Next Story