Telugu Global
NEWS

పోలీస్​శాఖలో కరోనా కలకలం.. సాగర్​ ఉప ఎన్నికే కారణమా?

దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని లక్షల కేసులొచ్చాయి.. ఎన్ని వందల మంది చనిపోయారు అన్న లెక్కలు అనవసరం. శ్మశానాల దగ్గర పడిగాపులు, ఆస్పత్రుల దగ్గర ఆక్సిజన్ కోసం ఎదురుచూపులు, రోగుల బంధువుల ఆక్రందనలు వింటే పరిస్థితి అర్థమవుతుంది కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో. తెలంగాణలోనూ రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ రాజకీయనాయకుల ప్రచారాలు, ఎన్నికల ర్యాలీలు ఆగడం లేదు. అక్కడ సోషల్​ డిస్టెన్స్​ ఉంటుంది అనేది భ్రమే. […]

పోలీస్​శాఖలో కరోనా కలకలం.. సాగర్​ ఉప ఎన్నికే కారణమా?
X

దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని లక్షల కేసులొచ్చాయి.. ఎన్ని వందల మంది చనిపోయారు అన్న లెక్కలు అనవసరం. శ్మశానాల దగ్గర పడిగాపులు, ఆస్పత్రుల దగ్గర ఆక్సిజన్ కోసం ఎదురుచూపులు, రోగుల బంధువుల ఆక్రందనలు వింటే పరిస్థితి అర్థమవుతుంది కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో.

తెలంగాణలోనూ రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ రాజకీయనాయకుల ప్రచారాలు, ఎన్నికల ర్యాలీలు ఆగడం లేదు. అక్కడ సోషల్​ డిస్టెన్స్​ ఉంటుంది అనేది భ్రమే. ఇదిలా ఉంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసుల సైతం కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. గత ఏడాది కూడా పోలీసు శాఖలో చాలా మందికి కరోనా సోకింది. ఈ సారి కూడా పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. అందులో కానిస్టేబుల్​ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు.

అయితే ఇటీవల సాగర్​ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అక్కడికి బందోబస్తుకు వెళ్లిన చాలా మంది పోలీసులకు కరోనా సోకినట్టు సమాచారం. సీఎం కేసీఆర్​, మరికొందరు టీఆర్​ఎస్​ నేతలకు కూడా అక్కడే కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. సాగర్​ ఉప ఎన్నిక కోసం నిజామాబాద్ జిల్లా నుంచి ఏసీపీ, ఇద్దరు సీఐలు నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 112 మంది బందోబస్తుకు వెళ్లారు. 16 రోజుల పాటు అక్కడ విధులు నిర్వహించారు.

సాగర్​ ఉప ఎన్నిక అనంతరం ఇంటికి రాగానే వీరిలో చాలా మందికి కోవిడ్​ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 32 మందికి కరోనా సోకినట్టు సమాచారం. వారిలో కొంతమంది హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరేమో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతానికి 17 మంది కోలుకున్నారని సమాచారం. కరోనా బారిన పడిన వారిని సీపీ కార్తికేయ పర్యవేక్షిస్తున్నారు. వారికి నిత్యం మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  27 April 2021 7:24 AM GMT
Next Story