Telugu Global
NEWS

మేలో టీకాలు ఇవ్వడం కుదరదు..! ఏపీ వైద్య ఆరోగ్యశాఖ

మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పై బడ్డ వారికి టీకాలు ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రకటన సాధ్యమేనా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు చాలా రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా? లేవా? అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్​లో 18 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా ఇవ్వడం అసాధ్యమని […]

మేలో టీకాలు ఇవ్వడం కుదరదు..! ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
X

మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పై బడ్డ వారికి టీకాలు ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రకటన సాధ్యమేనా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు చాలా రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా? లేవా? అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్​లో 18 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా ఇవ్వడం అసాధ్యమని ఏపీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్​ కుమార్​ సింఘాల్​ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఏపీలో టీకాలు ఇవ్వడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. జూన్​ నుంచి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 18​-45 మధ్య వయస్సు ఉన్నవారు మొత్తం 2.40 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘వ్యాక్సినేషన్​ కోసం ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు కంపెనీలతో చర్చించాం. అయితే వ్యాక్సిన్​ తయారు చేస్తున్న సంస్థలు సగం డోసులను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన సగం మాత్రమే రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ సగం వ్యాక్సిన్లతో వ్యాక్సినేషన్​ ప్రారంభించడం చాలా కష్టం’ అని ఆయన చెప్పారు.

కోవిన్​ యాప్​లో రిజిస్ట్రేషన్​ చేసుకొనేందుకు ఏపీలో మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలో తాము తర్వాత చెబుతామని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఏపీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నట్టు చెప్పారు.

పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో 50 మంది మాత్రమే పాల్గొనడానికే అనుమతి ఉందన్నారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్​లు, ఈత కొలనులు మూసివేసినట్టు తెలిపారు. ప్రజా రవాణా, సినిమా హాలు 50 శాతం సీట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగులు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

కోవిడ్​ చికిత్సలో కీలకమైన రెమ్​డెసివర్​ ఇంజెక్షన్లు ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తామని చెప్పారు. వాటిని బ్లాక్​ మార్కెట్​లో విక్రయించకుండా రోగులకు త్వరితంగా అందించాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

First Published:  27 April 2021 2:37 AM GMT
Next Story